–రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగ కుండా కొనుగోలు జరుపుతాం
–రైతులు పండించిన పంటకు గిట్టు బాటు ధర కల్పించడమే ధ్యేయం
–నల్లగొండ జిల్లా కలెక్టర్ సి. నారా యణ రెడ్డి
Narayana Reddy: ప్రజా దీవెన, మిర్యాలగూడ: రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా రైతులు (Farmers)పండించిన ధాన్యానికి మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని నల్గొండ జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి Narayana Reddy) తెలిపారు. శుక్రవారం అయన మిర్యాలగూడ పట్టణం సమీపంలోని అవంతిపురం మార్కెట్ యార్డ్ వద్ద ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే అత్యధికంగా నల్గొండ జిల్లాలో దాన్యం సేకరణ జరుగుతుందని, దీనిని దృష్టిలో ఉంచుకొని ఈ సంవత్సరం జిల్లా వ్యాప్తంగా (375)కొనుగోలు కేంద్రాల ఏర్పాటు కు చర్యలు తీసుకొని ఇప్పటివరకు (185 )కేంద్రాలను ప్రారంభించామని, 1,2 రోజుల్లో తక్కినవి ప్రారంభిస్తామని తెలిపారు .
గత సంవత్సరం వానకాలం ధాన్యం కొనుగోలుకు అక్టోబర్ 18 న మొదటి దాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించగా, ఈ సంవత్సరం అక్టోబర్ 5 ననే ధాన్యం కొనుగోలు కేంద్రాలు (Grain buying centres) ప్రారంభించామని, ప్రత్యేకించి మిర్యాలగూడ ప్రాంతంలో( 74) కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, రైతులు ఎలాంటి ఇబ్బంది పడకూడదు అన్న ఉద్దేశంతో సాధ్యమైనంతవరకు ప్రతి గ్రామానికి ఒక కొనుగోలు సెంటర్ చొప్పున ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. ధాన్యం పండించిన రైతులు ఎట్టి పరిస్థితులలో తక్కువ ధరకు ధాన్యాన్ని ఆమ్మాల్సిన అవసరం లేదని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర గ్రేడ్ -ఏ కు క్వింటాలుకు 2,320 /-రూపాయలు ,సాధారణ రకానికి 2300/- రూపాయలు పొందవచ్చని, అంతేగాక సన్నధాన్యానికి అదనంగా 500/- రూపాయల బోనస్ పొందవచ్చు అని ఆయన పునరుద్ధరించారు.
రైతులు ధాన్యాన్ని (Farmers grain)నాణ్యత ప్రమాణాలకు అనుకూలంగా తీసుకురావాలని, తేమ 17% కన్నా తక్కువగా ఉండాలని ,మట్టి పెల్లలు, రాళ్లు ఒక శాతం దాటవద్దని, తాలు మూడు శాతం దాటకూడదని, రంగు మారిన ధాన్యం ,మొలకెత్తినది 5 శాతం దాటకూడదని తెలిపారు ఒకవేళ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల కన్నా మిల్లర్ల వద్ద ఎక్కువ ధరకు దాన్యం కొంటె అక్కడ అమ్ముకున్నా ప్రభుత్వానికి ఎలాంటి ఇబ్బంది లేదని, అయితే ధాన్యం విషయంలో రైతులకు ఏవైనా ఇబ్బందులు ఏర్పడిన,లేదా సందేహాలను తలెత్తిన ప్రభుత్వ అధికారులను సంప్రదించవచ్చని ఆయన తెలిపారు .దీని కోసం ప్రత్యేకంగా నల్గొండలో కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని 9963407064 నెంబర్ కు ఫోన్ చేసి సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కరిస్తామని ఆయన వెల్లడించారు. ప్రత్యేకించి మిర్యాలగూడ (Miryalaguda)ప్రాంతంలో కొనుగోలు కేంద్రాలకు ఇంకా ధాన్యం రాలేదని, దీపావళికి ధాన్యం వస్తుందని, అయినప్పటికీ తాము ధాన్యం కొనుగోలు కేంద్రాలను ముందే ప్రారంభించి ధాన్యం కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్ వెల్లడించారు. సన్నధాన్యానికి, దొడ్డుధాన్యానికి వేరువేరుగా కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ స్పష్టం చేశారు. చివరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, రైతులు, మిల్లర్లు, ప్రభుత్వం (Farmers, Millers, Govt) సమన్వయంతో ముందుకు వెళుతున్నదని ,రైతులు ఈ విషయాన్ని గమనించాలని, తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసినట్లు వస్తున్న వార్తలు నమ్మవద్దని ఆయన స్పష్టం చేశారు.
మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం పండించిన రైతులకు (farmers) ఎలాంటి ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో ఐకెపి, వ్యవసాయ సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించిందని, ప్రభుత్వం, మిల్లర్లు, అధికారులు సమన్వయంతో ధాన్యం సేకరణను పర్యవేక్షిస్తున్నారని, తేమశాతం 17 కి మించకుండా రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తే ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర వస్తుందని, తాను ప్రతిరోజు ధాన్యం కొనుగోలు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నానని, ఎలాగైనా రైతులకు మేలు జరగాలన్నదే తమ ఉద్దేశం అని, ఎక్కడైనా రైతులకు (farmers) సమస్యలు వస్తే పరిష్కరించేందుకు మిర్యాలగూడ ఏరియాలో నాలుగు ప్రధాన రహదారులుంటే నలుగురు వ్యవసాయ అధికారులను ఏర్పాటు చేసి రైతులకు ఎక్కడైనా సమస్యలు వస్తే పరిష్కరిస్తున్నామని తెలిపారు. మిర్యాలగూడ కొనుగోలు కేంద్రాలకు ఇంకా ధాన్యం రాలేదని, మిర్యాలగూడలో (86) రైస్ మిల్లులు ఉన్నాయని, ఇప్పటివరకు ఒక్క ధాన్యం వాహనం సైతం మిల్లులకు రాలేదని ఆయన తెలిపారు. మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్, జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు ,పౌరసరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ ,రైస్ మిల్లర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్నాటి రమేష్, మిర్యాలగూడ రైస్ మిల్లర్ల అధ్యక్షులు శ్రీనివాస్ , తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.