Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana Reddy: బాధ్యతలు స్వీకరించిన కొత్త కలెక్టర్ నారాయణరెడ్డి

Narayana Reddy

Narayana Reddy: ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్ గా సి.నారా యణరెడ్డి (Narayana Reddy) ఆదివారం బాధ్యతలను స్వీకరించారు. శనివారం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రం లోని పలువురు జిల్లా కలెక్టర్లను బదిలీ చేయగా నల్లగొండ జిల్లా కలెక్టర్ గా పని చేస్తున్న దాసరి హరిచందన బదిలీ ఆయ్యారు. ఆమె స్థానంలో నూతన జిల్లా కలెక్టర్ గా సి. నారాయణరెడ్డి నియమితులైన విషయం తెలిసిం దే.వికారాబాద్ జిల్లా కలెక్టర్ (Vikarabad District Collector)గా పని చేస్తున్న ఆయన ఆదివారం నల్లగొండ జిల్లా కలెక్టర్ కార్యాల యం లోని కలెక్టర్ చాంబర్లో జిల్లా కలెక్టర్ గా పదవి బాధ్య తలను చేపట్టారు. ముందుగా నల్గొండ జిల్లాకు చేరుకున్న నూతన జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి కి (Narayana Reddy) స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద రెవెన్యూ అదనపు కలెక్టర్ జే. శ్రీని వాస్, నల్గొండ ఆర్డీవో రవి, స్థానిక తహసీల్దార్ శ్రీనివాసులు పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలి కారు.

అనంతరం నూతన కలెక్టర్ నేరుగా జిల్లా కలెక్టర్ కార్యాలయనికి చేరుకోగానే స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి. పూర్ణచంద్ర, కలెక్టరేట్ ఏ ఓ మోతిలాల్ పుష్పగు చ్చాలు అందజేసి స్వాగతం పలికారు . నల్గొండ జిల్లా (NALGONDA) నూతన కలెక్టర్ గా పదవి బాధ్యతలను స్వీకరిం చిన సందర్భంగా నూతన కలెక్టర్ సి.నారాయణ రెడ్డి కి పలువురు జిల్లా అధికారులు, సిబ్బంది పుష్ప గుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. నూతన జిల్లా కలెక్టర్ కు స్వాగతం పలికిన వారిలో సమాచా ర శాఖ సహాయ సంచాల కులు యు.వెంకటర్శ్వర్లు, పంచా యతీరాజ్ ఈ ఈ భూమయ్య , పబ్లిక్ హెల్త్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు , జిల్లా పరిశ్రమల శాఖ మేనేజర్ కోటేశ్వరరావు,మిషన్ భగీరథ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, కలెక్టర్ కార్యాలయ పరిపాల నాధికారి మోతిలాల్, జిల్లా కలెక్టర్ సిసిలు ప్రసాద్, కరుణాకర్ రెడ్డి తదితరులు ఉన్నారు.