— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
Narayana Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: నాగార్జు నసాగర్ ప్రాజక్ట్ (Nagarju Nasagar Project) ద్వారా ఈ సంవ త్సరం పూర్తిస్థాయిలో 2 పంటలకు సాగునీరు అందిస్తామని జిల్లా కలెక్ట ర్ సి.నారాయణరెడ్డి తెలిపారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ నీటి సామర్థ్యానికి చేరువలో ఉన్నందున సోమవారం ఆయన నాగార్జున సాగర్ ప్రాజక్ట్ క్రెస్ట్ గేట్లను తెరిచి సాగు నీటిని దిగువకు వదిలివేశారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతిని ధులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజక్ట్ 8 గేట్లును 5 ఫీట్ల ఎత్తు (Project 8 gates 5 feet high) తెరవడం జరిగిందని, సాయం త్రం వరకు మొత్తం 14 గేట్లను తెరవనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇదివరకే నాగార్జున సాగర్ ప్రాజక్ట్ ఎడమ కాలువ ద్వారా పూర్తిగా సాగు కోసం నీటీని వదలడం జరిగిందని, గత సంవత్సరం సాగునీరు లేనందున నీటిని వదలలేదని ,ఈసారి సాగునీటిని వదిలినందున ఆయకట్టు రైతులందరూ సంతోషంగా ఉన్నారని, ప్రస్తుతం రిజర్వాయర్లో (In the reservoir)ఉన్న నీటి సామర్థ్యం ఆధారంగా ఈ సంవత్సరం పంటలకు పూర్తిస్థాయిలో నీటిని అందించనున్నట్లు తెలిపారు. కాలువలకు సాగునీటిని కొంచెం కొంచెంగా విడుదల చేస్తున్నామని, ఎక్కడైనా కాలువలు బలహీనంగా ఉన్నచోట గుర్తించి వాటికి మరమ్మతులు చేస్తూ మూడు, నాలుగు రోజుల్లో పూర్తిస్థాయిలో సాగునీటిని (Irrigation water) వదలనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే చేరువులన్ని నింపుతామన్నారు. ఆయకట్టు రైతులందరూ సాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కలెక్టర్ (Collector)కోరారు. ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 584 అడుగుల మేర నీరు ఉందని, 14 గేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందని, శ్రీశైలం ప్రాజెక్టు నుండి వచ్చే వరద ఆధారంగా సాగునీటిని పెంచడం ,తగ్గించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ క్రెస్ట్ గేట్ల ను ఎత్తివేసినందున నది పరివా హక ప్రాంతంలోని ప్రజ లందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నదిలోకి స్థానానికి గాని, ఈతకు వెళ్లవద్దని, మత్స్యకారులు చేపలు పట్టేందుకు నది లోకి వెళ్ళవద్దని పశువులు గేదేలు, మేకల వంటి వాటిని నదిలోకి తీసుకువెళ్లకూడదని ఆయన హెచ్చరించారు. నాగార్జునసాగర్ కు పై నుండి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని గేట్లు ఎత్తే విషయాన్ని ముందుగానే ఆదివారం నుండి ప్రజలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు ,ఈఈ మల్లికార్జున రావు, తదితరులుజిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు . ఈ సంద ర్బంగా జిల్లా కలెక్టర్ కృష్ణ నీటికి పూ జలు నిర్వహించారు.
ఎగువ నుంచి భారీగా వరద చేరుకుంటుండటంతో నాగార్జున సాగర్ నిండుకుండలా మారింది. దీంతో నాగార్జునసాగర్ జలాశయం 10గేట్లను అధికారులు ఎత్తారు. ఈ ఉదయమే అధికారులు ఆరు గేట్లు ఎత్తగా..మధ్యాహ్నం మరో నాలుగు గేట్లను ఎత్తారు. అంతకు ముందు ఉదయం కృష్ణమ్మకు ఎస్‌ఈ నాగేశ్వరరావు, సీఈ అనిల్‌కుమార్ జలహారతి ఇచ్చి నీటిని దిగువకు విడుదల చేశారు. తొలుత దిగువ ప్రాంతాల ప్రజల అప్రమత్తత కోసం మూడుసార్లు సైరన్ మోగించారు.
ప్రస్తుతం సాగర్ క్రస్టు గేట్ల ద్వారా దాదాపు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలనున్నట్లు అధికారులు తెలిపారు. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుతం 582.6గా ఉంది. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.5 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటి నిల్వ 290.51 టీఎంసీలుగా ఉంది. సాగర్ ఇన్‌ఫ్లో 3,23,748 క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 83,331 క్యూసెక్కులుగా ఉంది.