— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
Narayana Reddy:ప్రజా దీవెన, నల్లగొండ: నాగార్జు నసాగర్ ప్రాజక్ట్ ద్వారా ఈ సంవ త్సరం పూర్తిస్థాయిలో 2 పంటలకు సాగునీరు అందిస్తామని జిల్లా కలెక్ట ర్ సి.నారాయణరెడ్డి (Narayana Reddy) తెలిపారు.నాగార్జునసాగర్ (Nagarjunasagar)ప్రాజెక్టు పూర్తి రిజర్వాయర్ నీటి సామర్థ్యానికి చేరువలో ఉన్నందున సోమవారం ఆయన నాగార్జున సాగర్ ప్రాజక్ట్ క్రెస్ట్ గేట్లను తెరిచి సాగు నీటిని దిగువకు వదిలివేశారు. ఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ మీడియా ప్రతిని ధులతో మాట్లాడుతూ ప్రస్తుతం ప్రాజక్ట్ 8 గేట్లును 5 ఫీట్ల ఎత్తు తెరవడం జరిగిందని, సాయం త్రం వరకు మొత్తం 14 గేట్లను తెరవనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
ఇదివరకే నాగార్జున సాగర్ ప్రాజక్ట్ (Nagarjuna Sagar Project)ఎడమ కాలువ ద్వారా పూర్తిగా సాగు కోసం నీటీని వదలడం జరిగిందని, గత సంవత్సరం సాగునీరు లేనందున నీటిని వదలలేదని ,ఈసారి సాగునీటిని వదిలినందున ఆయకట్టు రైతులందరూ సంతోషంగా ఉన్నారని, ప్రస్తుతం రిజర్వాయర్లో ఉన్న నీటి సామర్థ్యం ఆధారంగా ఈ సంవత్సరం పంటలకు పూర్తిస్థాయిలో నీటిని అందించనున్నట్లు తెలిపారు. కాలువలకు సాగునీటిని కొంచెం కొంచెంగా విడుదల చేస్తున్నామని, ఎక్కడైనా కాలువలు బలహీనంగా ఉన్నచోట గుర్తించి వాటికి మరమ్మతులు చేస్తూ మూడు, నాలుగు రోజుల్లో పూర్తిస్థాయిలో సాగునీటిని వదలనున్నట్లు ఆయన చెప్పారు. అలాగే చేరువులన్ని నింపుతామన్నారు. ఆయకట్టు రైతులందరూ సాగునీటిని జాగ్రత్తగా వినియోగించుకోవాలని కలెక్టర్ కోరారు.
ప్రస్తుతం నాగార్జునసాగర్ ప్రాజెక్టులో (Nagarjuna Sagar Project)584 అడుగుల మేర నీరు ఉందని, 14 గేట్ల ద్వారా రెండు లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదిలేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరిగిందని, శ్రీశైలం ప్రాజెక్టు నుండి వచ్చే వరద ఆధారంగా సాగునీటిని పెంచడం ,తగ్గించడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు. నాగార్జునసాగర్ క్రెస్ట్ గేట్ల ను ఎత్తివేసినందున నది పరివా హక ప్రాంతంలోని ప్రజ లందరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా నదిలోకి స్థానానికి గాని, ఈతకు వెళ్లవద్దని, మత్స్యకారులు (Fishermen)చేపలు పట్టేందుకు నది లోకి వెళ్ళవద్దని పశువులు గేదేలు, మేకల వంటి వాటిని నదిలోకి తీసుకువెళ్లకూడదని ఆయన హెచ్చరించారు. నాగార్జునసాగర్ కు పై నుండి వస్తున్న వరదను దృష్టిలో ఉంచుకొని గేట్లు ఎత్తే విషయాన్ని ముందుగానే ఆదివారం నుండి ప్రజలను అప్రమత్తం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.నాగార్జున సాగర్ ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ నాగేశ్వరరావు ,ఈఈ మల్లికార్జున రావు, తదితరులుజిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు . ఈ సంద ర్బంగా జిల్లా కలెక్టర్ (District Collector) కృష్ణ నీటికి పూ జలు నిర్వహించారు.