–నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి
Narayana Reddy:ప్రజా దీవెన, నల్గొండ టౌన్:జిల్లా అధికారులు ప్రజలకు జవాబుదా రీగా ఉండాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి (Narayana Reddy)అన్నారు. విధులలో సమయపాలన పాటించాలని ,పనిలో నాణ్యత ఉండాలని అన్నారు.రెగ్యులర్ పనులతో పాటు,ప్రభుత్వ ప్రాధామ్య పథకాల (Priority Schemes of Govt)అమలులో జాప్యం చేయవద్దని అన్నారు. ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. ముందుగా ఆయన జిల్లా అధికా రులతో మాట్లాడుతూ జిల్లా అధి కారులు కిందిస్థాయి సిబ్బందికి ఆదర్శంగా ఉండాలని,పనిలో నాణ్యత ఉండేలా చూడాలని, పరిపాలన పట్ల, జిల్లా యంత్రాంగం పట్ల ప్రజల్లో నమ్మకం కలిగించాలని, పనివేళల్లో నాణ్య మైన సేవలు అందించేందుకు ప్రతి అధికారి కృషి చేయాలని అన్నారు. విధుల పట్ల నిర్లక్ష్యంగా ఉండొద్దని, ప్రతి అధికారి బాధ్యతతో పనిచే యాలని అన్నా రు.
కాగా ఈ సోమ వారం సైతం ప్రజావాణి కార్యక్రమానికి (Prajavani program) ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పెన్షన్లు, భూముల సర్వే, సదరం సర్టిఫికెట్లు, భూముల వ్యవహారాలు ,వ్యక్తిగత విషయాలు తదితర అంశాలకు సంబంధించి ఫిర్యాదులను సమర్పించారు. ఆశ వర్కర్లు వారి సమస్యలను పరిష్కరించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కు వినతి పత్రాన్ని సమర్పించారు. ప్రజావాణి (Prajavani) ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని,ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవ ద్దని,మండల,గ్రామ స్థాయిలో సైతం ప్రజావాణి ఫిర్యాదులు వెంట వెంటనే పరిష్కరించాలని ఆదేశిం చారు.ఫిర్యాదుల పరిష్కారం పై పిర్యాదుదారుకు స్పష్టంగా తెలియజేయాలని,ఒక వేళ పిర్యాదు పరిష్కారం కానట్లైతే అందుకు గల కారణాలను తెలియజేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ (District Collector) తో పాటు, అదనపు కలెక్టర్ జె.శ్రీని వాస్, ,స్పెషల్ కలెక్టర్ నటరాజ్ , జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.