Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narayana reddy: పథకాల అమలులో ప్రథమ స్థానం నిలపాలి

–ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అ మలులో “టీం నల్గొండ” ముందు ఉండాలి
–జిల్లా అధికారులు వారంలో మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి
–పని చేసే వారిని ప్రోత్సహిస్తాం, ప నిచేయకపోతే కఠినంగా వ్యవహ రిస్తాం
—నల్లగొండ జిల్లా కలెక్టర్ సి.నారా యణరెడ్డి

Narayana reddy:ప్రజా దీవెన, నల్లగొండ: జిల్లా అధికారులు ప్రభుత్వ ప్రాధామ్య పథకాల అమలులో నల్గొండ జిల్లాను మొదటి స్థానంలో ఉంచేం దుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి (Narayana reddy) అన్నారు.జిల్లా కలెక్టర్ గా బాధ్య తలు స్వీకరించిన అనంతరం మంగ ళవారం ఆయన మొదటి సారిగా జిల్లా అధికారుల తో జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో సమావేశ మయ్యారు. జిల్లా అధికారులు ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం ఆయా పథకాల అమలులో నిర్దేశించిన లక్ష్యాల సాధనకు కృషి చేయాలని, బాధ్యతగా, క్రమ పద్ధతిలో ముందుకెళ్లాలని, ప్రతి శాఖ ద్వారా ప్రజలకు ఉపయోగప డే పనులపై ఆలోచన చేయాలని, వారంలో 3 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రభుత్వ పథకాలు నిజమైన లబ్ధిదారులకు జాప్యం లేకుండా అందే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో బాగా పనిచేసేవారిని ప్రోత్సహిస్తామని, అదే సమయంలో నిర్లక్ష్యంగా ఉండే వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు అన్ని ప్రభుత్వ పథకాల అమలులో టీమ్ నల్గొండ ను మొదటి స్థానంలో ఉంచేందుకు కృషి చేయాలని, పథకాల అమలు విషయంలో ప్రోటోకాల్ (protocol ) ప్రకారం ప్రజాప్రతినిధులను కలుపుకొని ముందుకు వెళ్లాలని చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని, పదవ తరగతి ఫలితాలలో ప్రస్తుత ఓరవడిని కొనసాగించాలని, పరీక్షలను పకడ్బందీగా నిర్వ హించేలా చూడాలని, ప్రతి పాఠశాలలో తాగునీరు, పారిశు ద్ధ్యం, విద్యుత్తు సౌకర్యాలపై మరో సారి క్షుణ్ణంగా తనిఖీ చేసి వీటికి ఎలాంటి కొరత లేకుండా చూసు కోవాలని ఆదేశించారు. క్లోరినేషన్ చేసిన తర్వాతే తాగు నీటిని విద్యార్థులకు ఇవ్వా లని, అదేవిధంగా పాఠశాల ల్లో ఎక్కడ షార్ట్ సర్క్యూట్ (Short circuit) జరగకుండా విద్యుత్ వైర్లు తగలకుండా చర్యలు చేపట్టాలని, ఇదే విధంగా అన్ని హాస్టల్లో సైతం తగు చర్యలు తీసుకోవాలన్నారు. వ్యవసాయ సీజన్ ప్రారంభమైనం దున యూరియా, ఎరువుల పంపి ణీ సక్రమంగా జరగాలని, ఎక్కడ సమస్య రానివ్వ వద్దని ,అలాగే ఎక్కడైనా నకిలీ విత్తనాలను అమ్మినట్లు దృష్టికి వస్తే ఉపేక్షించవద్దని, వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.ప్రభుత్వ ప్రాధామ్య పథకాలైన గృహజ్యోతి, 500 రూపాయలతో గ్యాస్ సిలిండర్, పెన్షన్లు తదితర వాటి వంటి విష యాలను సంబంధిత శాఖల అధికారులు అన్ని వివరాలతో సిద్ధంగా ఉండాలని చెప్పారు.పౌర సరఫరాల శాఖ ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థ తో పాటు, సీఎంఆర్ (cmr)పై ప్రతిరోజు పనిచేయాలని అన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ద్వారా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఉపకేంద్రాలు, జిల్లా ఆస్పత్రి తో పాటు, అన్ని ఆసుపత్రులలో డాక్టర్లు సిబ్బంది హాజరుపై ఒక క్రమ పద్ధతిని నిర్వహించాలని, అదేవిధంగా జిల్లాలో సాధారణ ప్రసవాలు జరిగే విషయంపై ఎక్కువ దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు.

జిల్లా అధికారులను, మండలాల ప్రత్యేక అధికారులుగా నియమిం చడం జరిగిందని, వారి శాఖల పనులతో పాటు, ఆయా మండలా ల పై సైతం ఎక్కువ దృష్టి కేంద్రీకరించి ప్రజలకు ఇబ్బందులు కలగకుం డా చూడాలని అన్నారు. ముఖ్యం గా ధరణి (Dharani) దరఖాస్తుల పరిష్కారంపై ముందుగా దృష్టి సారించాలన్నారు. అలాగేవచ్చే సోమవారం నుండి మండల స్థాయిలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని, ఎంపీడీవో నోడల్ అధికారిగా ఉంటారని, తహసిల్దార్, ఎంపీ ఓ, ఏపీఎం, వ్యవసాయ అధికారి, ఎంపిడిఓల తోపాటు ఇతర మండల స్థాయి అధికారులందరూ ప్రజావాణిలోని ఉండి ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరిస్తారని, ప్రజావాణి దరఖాస్తులను జిల్లా స్థాయిలలోగా వెబ్సైట్లో అప్లోడ్ చేయడం జరుగుతుందని, ఉదయం 10:30 నుండి మధ్యా హ్నం రెండు గంటల వరకు ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిం చాలని ఆదేశించారు. మండల స్థాయిలో 15 రోజులైనా పరిష్కారం కానీ ఫిర్యాదులను జిల్లా స్థాయికి రావాలని సూచించాలని, ప్రజావాణి కార్యక్రమానికి గ్రామపం చాయతీ కార్యదర్శుల సేవలను ఉపయోగించుకోవాలని, అన్ని పనుల్లో వారిని పూర్తిస్థా యిలో భాగస్వామ్యం చేయాలని అన్నారు. మండల స్థాయి ప్రజా వాణి వ్యవస్థను పటిష్టం చేయడంలో భాగంగా వచ్చే సోమవారం జిల్లా స్థాయిలో నిర్వ హించే ప్రజావాణి కార్యక్ర మాన్ని రద్దు చేస్తున్నామని, తనతో పాటు, అదనపు కలెక్టర్లు, జిల్లా స్థాయి అధికారులు అందరూ మం డలాలలో నిర్వహించే ప్రజావా ణి పై దృష్టి సారిస్తున్నందున, ప్రజావాణి కార్యక్రమం ఉండదని తెలి పారు. గ్రామాలలో ప్రభుత్వ పథకా లను సక్రమంగా అమలు చేసేం దు కు జిల్లా అధికారులు ముందస్తు ప్రణాళికను తయారు చేసుకోవాల ని, ప్రతివారం వీటిపై సమీక్షించాలని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసా యం, పౌరసరఫరాలు, సంక్షేమం తదితర శాఖల అధికారులతో సమీ క్షించారు. ఆర్డీవోలు ,జిల్లా అధికారు లు, మండలాల ప్రత్యేక అధికారు లు ఈ సమావేశానికి హాజరయ్యా రు.