Narendra Modi : ప్రజా దీవెన,హైద్రాబాద్: ఢిల్లీలో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ.. గుజరాత్ శకటాన్ని చూసి మురిసి పోయారు. ఆ శకటం వెళుతున్నంత సేపూ ప్రధాని మోదీ దానినే చూస్తూ ఉండిపోయారు.
ఈసారి గుజరాత్ శకటంలో ప్రధాని మోదీ జన్మ స్థలమైన వాద్నగర్‌కు స్థానం కల్పించారు. ఈ శకటంలో గుజరాత్ అభివృద్ధితో పాటు అక్కడి సంస్కృతి, వారసత్వం కనిపిస్తుంది. అహ్మదాబాద్ లోని సబర్మతి నదిపై నిర్మించిన అటల్ వంతెనకు గుజరాత్ శకటంలో చోటు కల్పించారు.