Naresh : ప్రజా దీవెన,కోదాడ: కోదాడనియోజకవర్గ ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా తనను ఎన్నుకున్నందుకు సూర్యాపేట జిల్లా టియుడబ్ల్యూజే 143 యూనియన్ అధ్యక్షులు వజ్జే వీరయ్య, జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్ కు నూతన కోదాడ నియోజకవర్గ అధ్యక్షులు కొలిచలం నరేష్ ధన్యవాదాలు తెలిపారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తానని అన్నారు. . యూనియన్ జిల్లా నాయకుల ఆదేశాలతో ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చిన పూర్తిస్థాయిలో విజయవంతం చేస్తానని తెలిపారు.
నాపై నమ్మకం ఉంచి నాకు ఇచ్చిన పదవికి పూర్తిస్థాయిలో న్యాయం చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. టియుడబ్ల్యూజే 143యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి నారపరాజు హరికిషన్, టీయూడబ్ల్యూజే 143 యూనియన్ నియోజకవర్గ అధ్యక్షులు వంగవీటి శ్రీనివాస్, నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు సలహాలు సూచనలతో యూనియన్ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు