Narri Swami : ప్రజా దీవన, నారాయణపూర్ : యాదాద్రి భువనగిరి జిల్లా లోని అత్యున్నత న్యాయస్థానం జిల్లా కోర్టు ప్రాంగణంలో జిల్లా కోర్టు బార అసోసియేషన్ అధ్యక్షులు హరినాథ్,లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి స్వామి లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ క్యాలెండర్ ని ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా కోర్టు బారాసోసియేషన్ అధ్యక్షుడు హరినాథ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న న్యాయవాదుల యొక్క సమాచారాన్ని సేకరించి న్యాయవాదులకు సంబంధించిన క్యాలెండర్ ని రూపొందించడం చాలా గర్వ కారణం నర్రి స్వామి లాయర్స్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్గా రాష్ట్రంలోని అన్ని బారా అసోసియేషన్స్ లోని అడ్వకేట్ ల సమాచారాన్ని సేకరించడం సామాజిక చైతన్యం కోసం కృషి చేస్తున్న స్వామి అభినందనీయులు అన్నారు.
లాయర్స్ పోరం పర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి కుర్మ మాట్లాడుతూ.. న్యాయవాదుల్లో సామాజిక చైతన్యం కోసం లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ క్యాలెండర్ ను నేను పుట్టిన జిల్లా భువనగిరి యాదాద్రి జిల్లా కేంద్రంలో సామాజిక చైతన్యానికి సామాజిక విప్లవాలకు ఖిల్లా అయిన బోనగిరి పట్టణంలో ఈ క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా సంతోషకరం అన్నారు. రాబోయే రోజుల్లో న్యాయవ్యవస్థలో జడ్జిల నియమాకాలలో సామాజిక న్యాయం పాటించాలని మా లాయర్స్ ఫోరం కోరుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో భువనగిరి జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ హరినాథ్ సీనియర్ న్యాయవాది నర్సిరెడ్డి,శ్రీనివాస్ గౌడ్,జూకంటి రవీందర్,ప్రసాద్,కేశవరెడ్డి,రవీందర్ రెడ్డి,నరహరి,అనేకమంది న్యాయవాదులు పాల్గొన్నారు.