Narri Swami : ప్రజా దీవన, నారాయణపురం : మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్ నారాయణపురం మండలంలో ప్రసిద్ధి చెందిన శ్రీ శ్రీ శ్రీ అన్నపూర్ణేశ్వరి ఆశ్రమం లో అన్నపూర్ణేశ్వర ఆశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ శంకరానంద స్వామి నీ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మునుగోడు నియోజకవర్గం కంటెస్టెండ్ ఎమ్మెల్యే అభ్యర్థి భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గం కంటెస్టెంట్ ఎంపీ అభ్యర్థి ప్రముఖ హైకోర్టు న్యాయవాది నర్రి స్వామి కురుమ మర్యాదపూర్వకంగా కలిసి లాయర్స్ పోరం ఫర్ సోషల్ జస్టిస్ క్యాలెండర్ ని అందజేశారు.ఈ సందర్భంగా క్యాలెండర్ ను ఆవిష్కరించిన శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణేశ్వరి ఆశ్రమ పీఠాధిపతులు శంకరనంద స్వామి మాట్లాడుతూ నర్రి స్వామి ఆశ్రమ భక్తుడు న్యాయవాదిగా ప్రాక్టీస్ చేయుచునే హిందుత్వం గురించి సామాజిక చైతన్యం గురించి నిరంతరం పరితపిస్తున్న ఈ నారాయణపురం మండలంలోని మల్లారెడ్డిగూడెం గ్రామంలో జన్మించిన వ్యక్తి ఆయనకు శుభాశీస్సులు కలగాలని ఆశీర్వదిస్తున్నాను అన్నారు.
తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లాయర్స్ పోరంపర సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి స్వామి మాట్లాడుతూ నారాయణపురం మండల వ్యాప్తంగా ఎంతో మందిని దేశభక్తులుగా దైవ భక్తులుగా తీర్చిదిద్దుతున్న శ్రీ శ్రీ శంకరనంద స్వామి గారిని కలిసి క్యాలెండర్ అందజేయడం ప్రాంతంలో పుట్టిన బిడ్డగా చాలా గర్వంగా ఉందని తెలియజేశారు రాబోయే రోజుల్లో దేవాలయాలకు ఆశ్రమలకు హిందూవులకు ఎలాంటి లీగల్ సమస్యలు ఉన్న నాయిపరమైనటువంటి ఇబ్బందులు ఉన్న పరిష్కరించడానికి ఒక న్యాయవాదిగా లాయర్స్ ఫోరం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గా అండ గా ఉంటామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో స్వామి యాదవ్, భీమగోని శివ, భూక్యా నాయక్, తెలంగాణ సామాజిక చైతన్య నాయకులు దువ్వ నవీన్,సింగం కృష్ణ, శ్రావణ్,పల్లె వెంకట్ రెడ్డి అనేకమంది పాల్గొన్నారు.