Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narri Swamy Kuruma : హైకోర్టు న్యాయమూర్తి సన్మానించిన లాయర్స్ ఫోరం

ఫోరమ్ బృందం… లాయర్స్ ఫోరం వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి స్వామి కురుమ

Narri Swamy Kuruma : ప్రజా దీవన,సమస్థాన్ నారాయణపురం: తెలంగాణ రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు ప్రాంగణంలో హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పుల్ల కార్తీక్ నీ లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ ప్రతినిధి బృందం శాలువాతో సన్మానించారు.ఈ కార్యక్రమాన్ని లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రి స్వామి కుర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా హైకోర్టు జడ్జి జస్టిస్ పుల్ల కార్తీక్ మాట్లాడుతూ న్యాయవాదులంతా సామాజిక న్యాయం కోసం ఉద్యమించడం న్యాయవాద వృత్తికి ఎంతో గర్వకారణం, నర్రి స్వామి న్యాయవాదిగా ప్రాక్టీస్ని సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తున్న తీరు అభినందనీయం అన్నారు.

 

లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు, చౌటుప్పల్ కోర్ట్ బారాసోసియేషన్ లైబ్రరీ కార్యదర్శి, హైకోర్టు ప్రముఖ న్యాయవాది నర్రి స్వామి మాట్లాడుతూ.. న్యాయవాదుల్లో సామాజిక చైతన్యం కోసం లాయర్స్ పోరంపర్ సోషల్ జస్టిస్ క్యాలెండర్ ను రూపొందించడం జరిగింది. ఈ క్యాలెండర్ ని జస్టిస్ పుల్ల కార్తీక్ గారికి అందజేయడం చాలా సంతోషకరమన్నారు.రాబోయే రోజుల్లో న్యాయవ్యవస్థలో నీ నియమాకాలో సామాజిక న్యాయం పాటించాలని మా లాయర్స్ ఫోరం కోరుతుందని తెలియజేశారు.సీనియర్ న్యాయవాదులు నాగుల శ్రీనివాస్ యాదవ్ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుంచి అంచలంచలుగా ఎదిగి హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ కార్తీక్ గారిని కలుసుకొని సన్మానించడం మా నాయకులందరికీ గర్వకారణం అన్నారు.

 

ఈ కార్యక్రమంలో తెలంగాణ బార్ కౌన్సిల్ వైస్ చైర్మన్ సునీల్ గౌడ్, లాయర్స్ పురం పర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర అధ్యక్షులు నాగుల శ్రీనివాస్ యాదవ్, బార్ కౌన్సిల్ మెంబర్ జనార్ధన్, సీనియర్ న్యాయవాదులు సుంకర జనార్ధన్, సాయి యాదవ్, ఓం ప్రకాష్ యాదవ్, జూనియర్ న్యాయవాదులు ఉదయ భూక్య, సుదర్శన్ నేత, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.