అందుకోసం ఒప్పుకోలేదని నార్సింగి జంట హత్య కేసులో అసలు విషయాలు బట్టబయలు
Narsingh Doublemurdercase: ప్రజా దీవెన, హైదరాబా ద్: జంట నగ రాల్లో సంచలనం రేపిన పుప్పా లగూడ జంట హత్య కేసులో అస లు విషయాలు బట్టబయల య్యా యి. దీంతో పోలీసు లు ముగ్గురిని అరెస్టు చేశారు. ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియో తీసేందుకు ప్రయ త్నించగా అంగీకరించలేదని మహిళను, ఇదే విష యంలో హెచ్చరిం చినందుకు ఆమె ప్రియుడిపై కక్ష గట్టి హతమార్చి నట్లు తెలిపిన పోలీసులు.
మధ్యప్రదేశ్‌కు చెందిన అంకిత్ సాకేత్ ఉపాధి కోసం హైదరాబాద్ లోని నానక్ రాం గూడకు వచ్చాడు.. హౌస్ కీపింగ్ పనిచేస్తున్న సమయంలో అతడికి ఛత్తీస్ ఘడ్‌కు చెందిన బిందుతో పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే ఆమెకు వివా హమై ముగ్గురు పిల్లలున్నారు.
వీరి సంబంధం తెలుసుకున్న బిందు భర్త వనస్థలిపురం పరిధిలోని చింతలకుంటకు మకాం మార్చాడు. అయినా బిందు, సాకేత్‌ల మ ధ్య బంధం కొనసాగింది. ఈ క్రమంలోనే ఆమె సాకేత్ సాయంతో వ్యభిచారం మొదలు పెట్టింది. ఈ విషయం తెలుసుకున్న మధ్యప్ర దేశ్‌కు చెంది గచ్చిబౌలిలో నివసించే సాకేత్ స్నేహితులు రాహుల్ కుమార్, రాజ్ కుమార్, సుఖేంద్రకుమార్లు బిందును తమ వద్దకు తీసుకురావాలని చెప్పారు.
దీంతో ఆమె జనవరి 8న భర్తకు చెప్పకుండా సాకేత్‌తో గచ్చిబౌలికి వచ్చి అతడి గదిలోనే ఉంది. రెండుసార్లు బిందుతో ఏకాంతంగా గడిపిన రాహుల్ కుమార్.. సెల్‌ఫోన్లో చిత్రీకరించేందుకు ప్రయత్నిం చగా ఆమె అడ్డు తెలిపి సాకేత్‌కు చెప్పింది. అతడు రాహుల్‌ను గట్టి గా హెచ్చరించడంతో గొడవ జరిగింది.
కక్ష గట్టిన రాహుల్.. బిందు, అంకిత్లను హతమార్చాలని నిర్ణయిం చుకుని రాజ్, సుఖేంద్రల సాయం తీసుకోవాలనుకున్నాడు. పథకం ప్రకారం రాహల్ ఈ నెల 11న అంకిత్ ద్వారా బిందును మరోసారి పిలిపించుకున్నాడు.అదేరోజు రాహుల్, రాజ్, సుఖేంద్రలు సాకేత్, బిందులను ఆటోలో పుప్పాలగూడ అనంత పద్మస్వామి గుట్టల్లోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు.
అందరూ మద్యం తాగుతుం డగా సుఖేంద్ర బిందును పక్కకు తీసుకె ళ్లాడు. అంకిత్ ఒంటరిగా ఉండడంతో అదే అదనుగా భావించిన రాహుల్, రాజ్ కుమార్లు కత్తితో పొడిచి బండరాయితో కొట్టి చంపా రు. ఆ తర్వాత బిందును హతమార్చారు.