Narsireddy : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : టీఎస్ యుటిఎఫ్ నల్గొండ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పత్రికా ప్రకటన లో ఫిబ్రవరి 7 శుక్రవారం నాడు ఉపాధ్యాయ, అధ్యాపక సంఘాలు బలపరిచిన అభ్యర్థి ఎమ్మెల్సీ అలుగబెల్లి నర్సిరెడ్డి ఉదయం 11 గంటలకు నల్గొండ జిల్లా కేంద్రం గడియారం సెంటర్ నుండి ర్యాలీగా నల్లగొండ కలెక్టరేట్ వరకు చేరుకొని కలెక్టర్ కార్యాలయంలో ఉమ్మడి వరంగల్ ఖమ్మం నల్లగొండ ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికల్లో అభ్యర్థి గా నామినేషన్ వేస్తారు.
విద్యారంగంపై అపార అనుభవం కలిగి వివిధ మేనేజ్మెంట్ ల ఉపాధ్యాయ, అధ్యాపక సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేస్తూ, విద్యా రంగ అభివృద్ధి కోసం శ్రమిస్తూ, తన ఎమ్మెల్సీ నిధులను విద్యారంగానికి మాత్రమే ఖర్చు చేసిన వ్యక్తి, అధ్యాపక, ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అలుగుబెల్లి నర్సిరెడ్డి ని మరొకసారి గెలిపించాలని వారు కోరినారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి ఉపాధ్యాయ అధ్యాపకులు అధిక సంఖ్యలో హాజరుకావాలని టీఎస్ యుటిఎఫ్ నల్గొండ జిల్లా కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు బక్కా శ్రీనివాస చారి, పెరుమాళ్ళ వెంకటేశం ఒక ప్రకటనలో తెలిపారు.