Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Narsireddy : కోదాడ నియోజకవర్గంలోని దేవాలయాలను పరిశీలించిన నర్సిరెడ్డి

Narsireddy : ప్రజా దీవెన,కోదాడ: తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు మెంబర్ నన్నూరి నర్సిరెడ్డి బుధవారం కోదాడ నియోజకవర్గం లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆకుపాముల గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ముకుందాపురం గ్రామంలోని ఇందిరా అనాధ శరణాలయంలో దాతల సహకారంతో నిర్మించిన నాలుగు అదనపు గదులను ప్రారంభించారు .

ఈ కార్యక్రమంలో కోదాడ హుజూర్నగర్ నియోజకవర్గ మాజీ ఇంచార్జిలు ఓరుగంటి ప్రభాకర్, మండవ వెంకటేశ్వర్లు గౌడ్ తో పాటుగా టిడిపి నాయకులు శ్రీమన్నారాయణ, కీసరి నాగయ్య ముదిరాజ్ ,బానోత్ నాగేశ్వరరావు నాయక్ తదితర ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు