*విద్యా, వైద్యం ప్రభుత్వ రంగంలోనే ఉండాలి.
*కేంద్రం బడ్జెట్ లో విద్యకు పది శాతం నిధులు కేటాయించాలి.
*ఎమ్మెల్సీగా ఉపాధ్యాయ, ఉద్యోగుల గొంతుకగా పనిచేశా. నర్సిరెడ్డి
Narsireddy : ప్రజా దీవెన,కోదాడ: ఉపాధ్యాయ విద్యారంగా సామాజిక సమస్యలపై శాసనమండలిలో నిరంతరం పోరాటమే తన ఎజెండా అని ఖమ్మం,వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎన్నికల యుటిఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం కోదాడ పట్టణంలోని యుటిఎఫ్ కార్యాలయంలో జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఎమ్మెల్సీగా తన పోరాటంతోనే ఉపాధ్యాయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కారమయ్యాయన్నారు. ఉపాధ్యాయ ఉద్యమాలు బలంగా ఉంటేనే సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. మరొకసారి తనను ఎమ్…