— వ్యకాస రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య
Nary Ailaiah : ప్రజా దీవెన నల్లగొండ: కేంద్ర బడ్జెట్ పేదలను నిండా న ముంచిన బడ్జెట్ అని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి నారీ ఐలయ్య తెలిపారు మంగళవారం నల్లగొండలోని దొడ్డి కొమురయ్య భవన్లో జరిగిన, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఆఫీసు, బేరర్స్ సమావేశానికి ముఖ్యఅతిథిగా పాల్గొని సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి గత సంవత్సరం కేటాయించిన 86 వేల కోట్లు మాత్రమే కేటాయించి 63 వేల కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది రెండున్నర లక్షల కోట్ల అవసరం ఉండగా నామమాత్రపు కేటాయింపులు చేసి వ్యవసాయ కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు అదనంగా పెంచలేదు. సంవత్సరానికి 200 పని దినాలు పెంచుతూ రోజుకు కూలి 600 రూపాయల ఇవ్వాలని దేశవ్యాప్త పోరాటాలు చేస్తున్నప్పటికీ పట్టించుకున్న పాపాన పోలేదు. అలాగే పట్టణ ప్రాంతాలలో కూడా పేదలు పెరుగుతున్నారు అందుకని పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రారంభించాలి అనేకసార్లు సూచించాము కానీ ఆ ప్రస్తావనే తేలేదు. అంటే ఈ బడ్జెట్ ద్వారా ఉపాధి హామీ రంగాన్ని ఎంత చిన్నచూపు చూస్తుందో అర్థమైతుంది భవిష్యత్తులో రద్దు చేయబోయే ప్రమాదం కూడా ఉందని అర్థం అవుతున్నద అన్నారు. రైతుల సమస్యల పైన, కనీస మద్దతు ధర పైన ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు పోరాటం చేస్తున్నా.
రైతులకు కనీస మద్దతు ధర మర్చిపోయారు. అయినా ప్రధాని గారు ఇది పేదల బడ్జెట్ అని చెప్పటం ఎంత మోసపూరితమైన కుట్రనో అర్థమైతుంది. అంతేకాదు హైదరాబాదు నుండి విజయవాడకు వెళ్లే రైలు సింగిల్ లైన్ కారణంగా నాలుగైదు గంటల సమయం పడుతుంది. అందుకని అనేక సంవత్సరాలుగా డబల్ ట్రాక్ ఏర్పాటు చేయాలని తెలుగు ప్రజలు కోరుతున్న. ఆ ఊసే బడ్జెట్ లో ఎత్తలేదు. మరి BJP ఎంపీ ఏం చేస్తున్నారో..! ఆత్మ విమర్శ చేసుకోవాలి. మరి ఇది పేదల బడ్జెట్ ఎట్లా అవుతుంది ? అని ప్రధాన మంత్రి గారిని, నిర్మల సీతారామన్ గారిని ప్రశ్నించారు, ఈ బడ్జెట్ కార్పొరేట్ సంస్థలకు మోకరిల్లే బడ్జెట్ లా ఉన్నదని విమర్శించారు. విద్యా వైద్యాన్ని విస్మరించారు. బీహార్ కు సంబంధించిన బడ్జెట్ లాగా ఉంది.
ఎందుకంటే బీహార్ ఆంధ్రప్రదేశ్ మద్దతోనే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారు. కనుక ఈ బడ్జెట్ బిజెపి రాజకీయ ప్రయోజన, కోసం పెట్టిన బడ్జెట్ అని విమర్శించారు ఈ బడ్జెట్ను వ్యతిరేకించాలని ప్రజలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. కేంద్ర బడ్జెట్ కు వ్యతిరేకంగా ఈనెల 19న ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద జరుగు ధర్నాలు పెద్ద ఎత్తున రైతులు కూలీలు కార్మికులు యువతీ యువకులు మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బొజ్జ చిన్న వెంకులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా నాయకులు కంబాలపల్లి ఆనందు చింతపల్లిలోర్దు మారయ్య రవి నాయక్ తదితరులు పాల్గొన్నారు