* పెన్షనర్లకు నకారా సేవలు చిరస్మరణీయం.
* విశ్రాంత ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి:సీతారామయ్య.
ప్రజా దీవెన, కోదాడ: విశ్రాంతి ఉద్యోగులు సమాజంలో ఉన్నత స్థానాన్ని గౌరవంగా జీవించేందుకు నకారాచేసిన కృషి మరువలేనిదని విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు రావెళ్ల.సీతారామయ్య అన్నారు. శనివారం జాతీయ పెన్షనర్ల దినోత్సవం సందర్భంగా కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు అధ్యక్షతన పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో అయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ముందుగా సంఘ సభ్యులు అందరితో కలిసి నకారా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోని ప్రభుత్వ ఉద్యోగులందరూ సుదీర్ఘకాలం ప్రభుత్వానికి సేవలందించి వారికి పెన్షన్ లేకపోవడం సరికాదని భావించి తన కర్తవ్యం గా, బాధ్యతగా న్యాయస్థానానికి వెళ్లి పెన్షన్ తీసుకువచ్చేందుకు నకార చేసిన కృషి చిరస్మరణీయం అన్నారు. ప్రభుత్వం పెన్షనర్లు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకోవాలన్నారు.
అనంతరం 70 సంవత్సరాలు నిండిన వారితోపాటు, సంఘ భవనానికి ఆర్థిక సహాయం అందించిన వారికి,డిసెంబర్ నెలలో పుట్టినరోజు జరుపుకునే పెన్షనర్లను శాలువాతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో కోదాడ యూనిట్ అధ్యక్షులు వేనేపల్లి శ్రీనివాసరావు, జిల్లా అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, సెక్రటరీ బొల్లు రాంబాబు, కోదాడ ఉపాధ్యక్షులు వెంకటేశ్వరావు, సెక్రటరీ రఘువర ప్రసాద్, విద్యాసాగర్,అమృతా రెడ్డి, పొట్ట జగన్మోహన్, ఖాళీల్ అహ్మద్, భ్రమరాంబ, శోభా రాణి,మరియు కార్యవర్గ సభ్యులు, పెన్షనర్స్ పాల్గొన్నారు.