–సీఐటీయూ
CITU : ప్రజాదీవెన నల్గొండ టౌన్ : తెలంగాణ పవర్ లూమ్ వర్కర్స్ యూనియన్ నల్గొండ పట్టణ కమిటీ సమావేశం ఐడిఏ ఆర్జీల బావిలో జరిగింది. ముఖ్యఅతిథిగా యూనియన్ జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య హాజరై మాట్లాడుతూ జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. రోజుకు రాష్ట్ర ప్రభుత్వం 10 గంటల పని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోమవారం అన్ని మండల కేంద్రాల్లో జీవో కాపీల దగ్ధం చేయాలని కార్మిక శాఖ కార్యాలయాల ముందు ధర్నా చేపట్టాలని సిఐటియు రాష్ట్ర కమిటీ పిలుపు ఇచ్చిందని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్మికులు పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పద్మనగర్ ఇండస్ట్రియల్ ఏరియా అధ్యక్ష కార్యదర్శులు గంజి నాగరాజు, పెండెం బుచ్చి రాములు, సూరపల్లి భద్రయ్య, దేవులపల్లి గిరిబాబు, పసునూరి యోగానందం, మహిళ కార్యదర్శి మిర్యాల శ్రీవాణి, గంజి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.