*శ్రీ మహిషాసుర మర్దిని గా దర్శనం ఇచ్చిన అమ్మవారు.
Navaratri Celebrations: ప్రజా దీవెన, కోదాడ: పట్టణంలోని నయానగర్ రామినేని టవర్స్ సమీపాన దేవీ నవరాత్రుల ఉత్సవాలు (Navaratri Celebrations)ఘనంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం అమ్మవారు భక్తులకు మహిషాసుర మర్దిని,రాజరాజేశ్వరి దేవి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. దంపతులు పీటల మీద కూర్చొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు (pooja programme)నిర్వహించారు. వేద పండితులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు చేశారు. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి కుంకుమ పూజలు (kumkum poojak)/నిర్వహించారు.అనంతరం భక్తులకు అన్నదానం తీర్థ,ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నయా నగర్ దేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు..