Navodaya Entrance Exam : ప్రజా దీవెన, కోదాడ: పట్టణములో మొదటి సంవత్సరం నవోదయ ఎంట్రన్స్ పరీక్ష లకు అన్ని ఏర్పాట్లు పూర్తయినట్లు పరీక్షల నిర్వహణ చీప్ సూపర్డెంట్ గుండె పోయిన రాజు సెంటర్ లెవెల్ అబ్జర్వర్ డి మార్కండేయ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు సందర్భంగా వారు మాట్లాడుతూ ఇంటర్ మొదటి సంవత్సరం నవోదయ ఎంట్రన్స్ పరీక్షలు నేడు ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నవోదయ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్ష 2025 జరుగుతుంది వారు తెలిపారు పరీక్ష నిర్వహణకు సంబంధించిన ఇన్విజిలేటర్స్ శిక్షణ సమావేశం శుక్రవారం నిర్వహించి పరీక్ష నిర్వహణ సూచన సలహాలు వివరించినారు.
పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు హాల్ టికెట్ తో పరీక్షా కేంద్రమునకు ఉదయం 10 గంటల వరకు చేరుకోవాలని తెలియజేశారు. కోదాడలో మూడు కేంద్రాలను కేటాయించారని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, సి సి ఆర్ విద్యా నిలయం, ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల యందు పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు .