*గాయత్రి దేవిగా దర్శనం ఇచ్చిన అమ్మవారు.
Navratri festivals: ప్రజా దీవెన,కోదాడ : పట్టణంలోని నయా నగర్ మదర్ థెరిస్సా పాఠశాల (Mother Teresa School)దగ్గర దేవీ నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు రెండవ రోజు అమ్మవారు భక్తులకు గాయత్రీ దేవి రూపంలో దర్శనం ఇచ్చారు.వేద పండితులు, భక్తులు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకాలు (Anointings)నిర్వహించారు. మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమ్మవారి మండపం వద్ద కుంకుమ పూజలు (Saffron worship) నిర్వహించారు.కక్కిరేణి లచ్చయ్య, రాజేశ్వరి కక్కిరేణి నరేష్,అశ్విని,దేవాన్స్ దంపతులు పీటల మీద కూర్చొని అమ్మవారి విగ్రహం వద్ద ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నదానం తీర్థ,ప్రసాదాలు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో నయా నగర్ దేవి నవరాత్రుల ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.