Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Neela Satyanarayana: కలాం దేశానికి  చేసిన సేవలు చిరస్మరణీయం.

*నేటి యువత కాలం ను ఆదర్శంగా తీసుకోవాలి నీలాసత్యనారాయణ.

Neela Satyanarayana: ప్రజా దీవెన, కోదాడ:భారత దేశ శాస్త్ర సాంకేతిక రంగాలకు విశిష్ట సేవలు అందించి దేశం కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహానీయుడు భారతరత్న, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం (APJ Abdul Kalam)అని స్వర్ణ భారతి ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు, కలాం విగ్రహ ఫౌండర్, కిట్స్ కళాశాల చైర్మన్ నీలా సత్యనారాయణ (Neela Satyanarayana) అన్నారు. మంగళవారం అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా విజయీభవ ట్రస్ట్, స్వర్ణ భారతి చారిటబుల్ ట్రస్ట్, (Vijaybhava Trust, Swarna Bharati Charitable Trust,) ఇరుకుళ్ల ఫౌండేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని గాంధీ పార్క్ లో కలాం విగ్రహానికి ట్రస్ట్ సభ్యులు, కళాశాల విద్యార్థులతో కలిసి పూలమాలలు వేసి  ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన గొప్ప శాస్త్రజ్ఞుడు అని రాష్ట్రపతిగా అన్ని వర్గాల ప్రజల మన్ననలను అందుకుని ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న గొప్ప వ్యక్తి డాక్టర్ అబ్దుల్ కలామ్ (APJ Abdul Kalam) అని దేశానికి వారు చేసిన సేవలను కొనియాడారు. నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకొని వారు చూపిన బాటలో నడవాలి అన్నారు.  ఈ కార్యక్రమంలో  స్వర్ణభారతి ట్రస్ట్ అధ్యక్షులు గాదంశెట్టి. శ్రీనివాసరావు, ఇరుకుళ్ల ఫౌండేషన్ అధ్యక్షులు ఇరుకుళ్ల.చెన్నకేశవరావు పందిరి సత్యనారాయణ, రాయపూడివెంకటనారాయణ,పుల్లకాండం. సాంబశివరావు,పత్తి నరేందర్, వెంపటి ప్రసాద్,గుడుగుంట్ల. సాయి,పైడిమర్రి. రామారావు,జగనీ ప్రసాద్,కాలంగి వెంకటేశ్వర్లు, వెంపటి వెంకటరమణ, శంకర్, రవికుమార్, కొత్త ఉపేందర్,  కుక్కడపు శ్రీనివాసరావు, కుక్కడపు వెంకటేశ్వరరావు  తదితరులు పాల్గొన్నారు.