–బీహార్ లో అరెస్టైన అభ్యర్ధి బజాప్తా వెల్లడి
–ఒక్క రోజు ముందే మా చేతికి అందింది
–ముగ్గురికి రూ.30 లక్షల చొప్పున అమ్మినట్లు వాంగ్మూలం
— చెలరేగుతున్న రాజకీయ దుమారం
NEET: ప్రజా దీవెన, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్ (NEET) పేపర్ లీకేజీ కి సంబందించి మరో సారి వాస్తవాలు వెలుగు చూశాయి. వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం జాతీయ స్ధాయిలో నిర్వహిస్తున్న నీట్ యూజీ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ అయినట్లు స్పష్టమైoది. నీట్ పేపర్ కేసులో తాజాగా అరెస్టు అయిన విద్యార్థి నీటుగా అంతా నిజమే అని ఒప్పుకున్నాడు. ఈసారి నీట్ (NEET) పరీక్షలో భారీ సంఖ్యలో టాపర్లు రావడంతో దీనిపై అనుమానాలు మొదలైన విషయం తెలిసిందే. చివరికి అభ్యర్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దర్యాప్తు క్రమంలో అరెస్టు చేసిన ఓ అభ్యర్ధి విచారణ లో సంచలన విషయాలు వెల్లడిం చాడు.నీట్ పరీక్ష పేపప్ లీక్ ( PAPER leak)పై జరుగుతున్న విచారణలో భాగంగా అరెస్టు అయిన అభ్యర్ధి అనూరాగ్ యాదవ్ పలు విషయాలు వెల్ల డించాడు. ఇందులో తాను నీట్ పరీక్షకు ముందు రోజు రూ.30 లక్షల చొప్పున తీసుకుని నలు గురి కి పేపర్ ను అమ్మేయడంతో పాటు సమాధానాలను కూడా వారికి అం దించినట్లు తెలిపాడు. అలాగే తన కు లభించిన ప్రశ్నాపత్రం అసలు పరీక్ష పేపర్ తో సరిపోలినట్లు కూ డా అనురాగ్ పేర్కొన్నాడు. బీహార్ లోని దానాపూర్ టౌన్ కౌన్సిల్ (Town Council) కా ర్యాలయంలో జూనియర్ ఇంజనీర్ కు మేనల్లుడైన అనురాగ్ యాదవ్ తాను ఈ కార్యాలయంలోనే పేపర్ ను అభ్యర్ధులకు అమ్మినట్లు విచా రణలో అంగీకరించాడు. ఈ మేరకు తన మేనమామ సహకరించినట్లు తెలిపాడు. మరోవైపు పాట్నాలో నీట్ పరీక్ష నిర్వహణలో అవకత వకలు జరిగాయన్న ఆరోపణలపై కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ బీహార్ పోలీసు (Bihar Police) ఆర్థిక నేరాల విభాగం నుం చి నివేదిక కోరింది. అటు సుప్రీంకో ర్టు కూడా పేపర్ లీక్ ఆరోపణలపై ఇప్పటికే ఎన్డీఏతో పాటు సంబంధి త శాఖలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై దిద్దుబాటు చర్యలు వెంటనే చేపట్టాలని సూచించింది.
సుప్రీంలో ఎన్టీఏ కు ఊరట…
సుప్రీం కోర్టులో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి మరోమారు ఊరట దక్కింది. నీట్ కౌన్సెలింగ్‌ను (NEET Counselling) రద్దు చేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. నీట్ (NEET) వ్యవహారంపై వివిధ రాష్ట్రాల హైకోర్టులో దాఖలైన పిటి షన్ల బదిలీ పిటిషన్‌పై సానుకూలం గా స్పందించింది. గురువారం నీట్ యూజీ 2024 పరీక్షలకు సంబంధిం చిన 14 పిటిషన్లపై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాస నం విచారణ చేపట్టింది. ఇందులో 49 మంది విద్యార్థులు 10 పిటి షన్లను అలాగే ఎన్టీఏ నాలుగు పిటి షన్లు ఉన్నాయి. దేశవ్యాప్తంగా నీట్ అవకతవకలపై పలు హైకోర్టులలో పిటిషన్లు దాఖలు అయ్యాయి. అయితే వాటన్నింటినీ సుప్రీం కోర్టుకు బదిలీ చేసేలా ఆదేశా లివ్వాలని ఎన్టీఏ కోరింది. దీనికి సుప్రీం బెంచ్ సానుకూలంగా స్పం దించింది. ప్రతివాదులకు గురువా రం నోటీసులు (NOTICE) జారీ చేసింది. అలాగే కేసులకు సంబంధించి హైకోర్టులో జరిగే విచారణలపై స్టే విధించిం ది.మరోవైపు వివిధ విద్యార్థులు ఎన్టీయే కౌన్సెలింగ్ రద్దు చేయాలని చేసిన విజ్ఞప్తికి సుప్రీం నిరాకరించిం ది. అయితే వాళ్లు వేసిన పిటిషన్‌పై విచారణకు మాత్రం అంగీకరించిం ది. ఈ క్రమంలో పిటిషన్లపై స్పందన తెలియజేయాలని కేంద్రానికి, ఎన్టీఏ కు మరోసారి నోటీసులు జారీ చేసిం ది. ఈ పిటిషన్లపై జులై 8న విచార ణ జరపనుంది. అదే రోజు గతంలో నీట్ పై దాఖలైన పలు పిటిషన్ల విచారణ జరగాల్సి ఉంది.