Nehru yuva : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నెహ్రు యువ కేంద్ర ఎన్జీవో వారి ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ సొసైటీ భవనంలో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం కు ఎస్పీ ఆదేశాల మేరకు ముఖ్య అతిథిగా కోట కరుణాకర్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ హాజరై మాట్లాడుతూ మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్ వాడకం పట్ల కలిగే అనర్ధాలను గురించి మాట్లాడుతూ డ్రగ్స్ వాడిన వారిని గుర్తించే టెస్ట్ కీట్లతో అవగాహన కల్పించడం జరిగింది.
అదేవిధంగా డ్రగ్స్ వాడడం వల్ల చట్టపరంగా కఠిన శిక్షలు ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అదేవిధంగా రాగింగ్ పై సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడం జరిగింది.