–జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
District Collector Tripathi : ప్రజాదీవెన నల్గొండ : నవంబర్ నాటికి నకిరేకల్ నూతన ఏరియా ఆసుపత్రి నిర్మాణాన్ని పూర్తిచేసి వైద్య సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి వైద్యాధికారులను, సంబంధిత కాంట్రాక్టర్ ను ఆదేశించారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా, నకిరేకల్ నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఏరియా ఆసుపత్రిని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆసుపత్రి నిర్మాణ పనులపై సంతృప్తి వ్యక్తం చేశారు.
కాంట్రాక్టర్, వైద్యాధికారి శోభారాణి తో మాట్లాడుతూ త్వరితగతిన ఆసుపత్రి నిర్మాణ పనులను పూర్తి చేయాలని, నవంబర్ లోగా నిర్మాణం పూర్తయితే నవంబర్ నుండి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రస్తుత ఆస్పత్రి ద్వారా అందిస్తున్న వైద్య సేవలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, ఆసుపత్రి వైద్యులు, అనస్తీసియా డాక్టర్, తదితరులు జిల్లా కలెక్టర్ వెంట ఉన్నారు.