ప్రజా దీవెన, శాలిగౌరారo: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వసతి గృహల్లో పెంచిన చార్జీలకు అనుగుణoగా నూతన మెనూ ను అమలు చేయాలని శాలిగౌరారం మండల ప్రత్యేక అధికారి బి. మన్యా నాయక్ కోరారు. శాలిగౌరారం లోని ఎస్ సి బాలుర వసతి గృహం లో అయన నూతన మెనూ ను ప్రారంభిచారు.
ఈ సందర్బంగా మన్యా నాయక్ మాట్లాడుతూ పెంచిన డైట్ చార్జీలకు అనుగుణంగా విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, కాస్మోటిక్ చార్జీలు ఇవ్వాలని కోరారు.విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ గార్లపాటి జ్యోతి లక్ష్మి, ఎంఈవో మందుల సైదులు, ఎంపీ వో పద్మ, రామదాసు తదితరులు పాల్గొన్నారు. అనంతరం విద్యా ర్థుల తో కలిసి భోజనం చేశారు.