ప్రజా దీవెన, కోదాడ: కోదాడ బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ వి ఏసయ్య ఆధ్వర్యంలో రూపొందించిన 2025 క్రైస్తవ క్యాలెండర్ ను బుధవారం పట్టణములోని స్థానిక బాప్టిస్ట్ చర్చి ఆవరణలో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోదాడ శాసనసభ్యురాలు నలమాది పద్మావతి రెడ్డి పాల్గొని నూతన క్యాలెండర్ ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరం అందరూ సుఖసంతోషాలతో ఒకరు ప్రేమతో జీవించాలని ఆ మెత్త తెలిపారు పాత చెడు అలవాట్లు వదిలిపెట్టి నూతన సమాజ స్థాపన కొరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో కోదాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు గుండెపంగు రమేష్, బాల్ రెడ్డి, కాటంరెడ్డి ప్రసాద్ రెడ్డి, ఎర్రవరం పిఎసిఎస్ చైర్మన్ నల్లజాల శ్రీనివాసరావు, గంధం పాండు, కుడుముల రాంబాబు, గడ్డం యేసు, తదితరులు పాల్గొన్నారు.