Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Newrationcard : కొత్త రేషన్ కార్డులకు కొరివి, మీ సేవా వార్తలపై ఈసీ తేటతెల్లం

కొత్త రేషన్ కార్డులకు కొరివి, మీ సేవా వార్తలపై ఈసీ తేటతెల్లం

Newrationcard:  ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలో గడిచిన పదే ళ్లుగా కొత్త రేషన్ కార్డుల కోసం లబ్ధ దా రుల ఎదురుచూస్తున్న విషయం వి ధితమే.ఈ నేపథ్యంలో తాజాగా ప్ర భుత్వం దరఖాస్తులు చేసుకునే అ వకాశాన్ని కల్పించింది. ఇదిలా ఉం టే తాజాగా తెలంగాణలో కొ త్త రే షన్ కార్డులకు ఎన్నికల సంఘం బ్రేక్ వేసిందని వస్తున్న వార్తల పై ఈసీ క్లారిటీ ఇచ్చింది.

అలాంటిది ఏమీ లేదని ఎలాంటి ఆదేశాలు ఇ వ్వలేదని ఈసీ స్పష్టం చేసింది. ఎ మ్మెల్సీ ఎన్నికల కోడ్ దృష్ట్యా వాటి ని తక్షణమే నిలిపి వేయాలని ఎన్ని కల సంఘం ఆదేశించిందని వస్తు న్న వార్తలు అవా స్తమని, మీడి యా లో వస్తున్న వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చిం ది.ఎంతో కాలంగాకొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదు రు చూస్తు న్నారు.

దీంతో ప్రభుత్వం శుక్రవారం నాటి మెమోలో రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ఆహార భద్ర త లేదా రేషన్ కార్డు దర ఖాస్తు ల ను స్వీకరించే సేవ లను ప్రారంభిం చా లని అన్ని మీసేవా కేంద్రాలను తెలంగాణ ప్రభు త్వం ఆదేశించింది. గత నెల 26న గ్రామసభల్లో దర ఖాస్తు చేయని వారు కూడా మీ సే వా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాలని పౌర సర ఫరాల శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఉన్న రేషన్ కార్టు ల్లో మార్పులు చేర్పులు వంటి వా టికి వెసులుబాటు కల్పిస్తూ ఉత్త ర్వులు జారీ చేసింది.

ఈ క్రమంలో మీ సే వా కేంద్రాల్లో కొత్త రేషన్ కా ర్డుల దర ఖాస్తు కోసం చాలా మం ది లబ్ధిదారులు వెళ్లగా వారికి నిరా శే మిగిలింది. ప్రజలు మీ సేవా సెం టర్ కు వెళ్లే సర్వీస్ అందు బాటు లో లేదని చూపిం చడంతో కాస్త ఆం దోళనకు గురయ్యారు. ఎందుకని మీ సేవా నిర్వా హకులకు కూడా తెలియడం లేదు.ఇదిలా ఉoడగా ప్రస్తుతం తెలం గాణలో 281. 70 లక్షల యూనిట్లను కవర్ చేసే 89. 96 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిలో 35.51 లక్షలు రాష్ట్రం జారీ చేసిన కార్డులు కాగా మిగి లినవి 54.45 లక్షలు జాతీయ ఆ హార భద్రతా చట్టం (NFSA) కా ర్డులు, ఆహార భద్రతా కార్డులకు అర్హత ఆదా యం, భూమి యాజమాన్యం, మరికొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుంది.