NG College : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నాగార్జున ప్రభుత్వ కళాశాల (అటానమస్) లో ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన విద్యార్థులలో ఉన్న సృజనాత్మక ను వెలికి తీసి కొత్త ఆవిష్కరణలను సృష్టించే విద్యార్దులు గా తీర్చి దిద్దడానికి యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్లో చేరుటకు విద్యార్దులకు ఓరియంటేషన్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ కో ఆర్డినేటర్ బి.అనిల్ మాట్లాడుతూ ఇంక్వి ల్యాబ్ ,యువ,ఇమాజిన్,యూనిసెఫ్ ,వై హబ్ ,యువత సంస్థలు సంయుక్తంగా సహాకారం అందిస్తూ విద్యార్దులు క్రమశిక్షణ తో చదువుతూనే ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా సృజనాత్మకత, నైపుణ్యాలతో తమ ప్రాంతంలో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపుతూ నూతన ఆవిష్కరణలు చెయ్యడానికి మూడూ దశలలో ప్రతిభ కనబర్చిన విద్యార్దులకు సర్టిఫికెట్స్ మరియు రివార్డులు అందచేస్తూ యూత్ ఫర్ సోషల్ ఇంపాక్ట్ ప్రోత్సహిస్తూ అవకాశం కల్పిస్తుంది అన్నారు .
ఈ కార్యక్రమంలో యన్ కోటయ్య,అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ హిస్టరీ,యమ్ సావిత్రి అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్ మరియు డా.అంకుస్ ,విద్యార్దిని విద్యార్దులు మరియుయన్ యస్ యన్ వాలంటీర్స్ పాల్గొన్నారు.