కరీంనగర్ లో ఎన్ఐఏ సోదాలు
ప్రజా దీవెన/ కరీంనగర్: తెలంగాణ లో ఎన్ఐఏ సోదాలు కలకలం రేపుతున్నాయి. కరీంనగర్ హుస్సేనీ పూరలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తోంది.పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాకు చెందిన ఓ కీలక నేత నివాసంలో గురువారం ఉదయం సోదాలు జరుపుతోంది. ఈ సోదాల్లో ఎన్ఐఏతో పాటు, స్థానిక పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
నాలుగున్నర గంటలుగా పీఎఫ్ఐ నేత ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. పలు కీలక డ్యాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల సమయంలో సదరు నేత ఇంట్లో లేరని, గల్ఫ్‌లో ఉంటున్నట్లు అధికారులు గుర్తించారు. నిషేధిత సంస్థ లింకులను అధికారులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.