Niranjan Reddy : ప్రజాదీవెన, యాదాద్రి :యాదాద్రి జిల్లా రామన్నపేట మండలంలోని బి.తుర్కపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి ఇటీవల జరిగిన బదిలీలలో పాఠశాలలో చేరినప్పటి నుండి ఇప్పటివరకు నెలలో రెండు సార్లు మాత్రమే హాజరై మిగతా దినములకి సంతకాలు చేస్తూ నెలకు అక్షరాల లక్షన్నర జీతం తీసుకుంటున్నాడు.సంఘానికి నాయకుడని గ్రామస్తులను నమ్మించి , బినామీ టీచర్ ని నియమించి పాఠశాల విధులకు హాజరు కాకుండా హైదరాబాదులో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేస్తున్నాడు.
ఈయన తీరుపై స్థానిక యువకులు అధికారులకు ఎన్నో మార్లు విన్నవించినప్పటికీ చూసి చూడనట్లుగా వ్యవహరించారు.
ఈ విషయాన్ని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకపోతుల నరేందర్ గౌడ్ కు వివరించగా నిన్నటి రోజున స్వయంగా తానే పాఠశాలను సందర్శించగా నిరంజన్ రెడ్డి యొక్క నిజ స్వరూపం బయటపడింది.
గతంలో ఈయన ఇదే పాఠశాలకు డిప్యూటేషన్ పై వచ్చి సంవత్సరం పాటు పాఠశాల ముఖం చూడకుండా కూడా నెలల జీతం తీసుకునే వారని, ఆ తర్వాత చౌటుప్పల్ మండలంలోని మల్కాపురం గ్రామంలో కూడా పాఠశాల విధులకు హాజరు కాకుండా ఉండడంతో అక్కడ యువకులు మీడియా దృష్టికి తీసుకుపోగా అధికారులు అతన్ని సస్పెండ్ చేసి చేతులు దుల్పుకున్నారు.
అధికారులు ఇప్పటికైనా తక్షణమే స్పందించి ఇలాంటి టీచర్ని మా ఊరి నుంచి తొలగించి ఒక మంచి ఉపాధ్యాయుడిని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇట్టి విషయంపై ఉపాద్యాయుడు ముదిరెడ్డి నిరంజన్ రెడ్డి మీద శాఖపరమైన చర్యలు తీసుకోవాలని ఆర్జెడిఎస్ఈ విజయ లక్ష్మి కు కంప్లైంట్ ఇస్తున్న తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎర్ర శ్రీహరి గౌడ్, రాష్ట్ర కార్యదర్శి గిరగాని భిక్షపతి గౌడ్, తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు పాల్గొన్నారు.