Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

నల్లగొండలో ఫ్రూట్ మార్కెట్ లో దారుణం

నల్లగొండలో ఫ్రూట్ మార్కెట్ లో దారుణం

ఏసీ సిలిండర్ పేలి ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి

మాంసం ముద్దులైన మృతదేహాలు

నల్లగొండ:
నల్లగొండలో ని బర్కత్ పురా కాలనీ లో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. న్యూ స్టార్ ఫ్రూట్స్ కంపెనీ కోల్డ్ స్టోరేజి లో ఏసి గ్యాస్ సిలిండర్ మారుస్తుండగా పేలింది. అక్కడ ఉన్న ఇద్దరు వ్యక్తులు ముక్కలు ముక్కలై చనిపోయారు. ఈ సంఘటనలో కోల్డ్ స్టోరేజి ఓనర్ షేక్ కలీమ్, అందులో పనిచేసే వ్యక్తి సాజిద్ మృతులుగా గుర్తించారు.

 

పేలుడు జరిగిన సమయంలో అక్కడ నలుగురు వ్యక్తులు ఆ స్టోరీజి పేలుడు నుండి తప్పించుకున్నట్లు అక్కడి వారు తెలిపారు. నల్లగొండ ఏఆర్ అడిషనల్ ఎస్పీ హనుమంతరావు, డి.ఎస్.పి నరసింహారెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. జిల్లా ఎస్పీ అపూర్వరావు కూడా ఘటన స్థలాన్ని సందర్శించనున్నారు.