–విరేచనాలు, కడుపునొప్పితో వి ద్యార్థినులకు అస్వస్థత
–దేవరకొండ, తూర్పుపల్లి హా స్పిటళ్లకు తరలింపు
Devarakonda Ashram School :ప్రజా దీవెన, నల్లగొండ : నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం ముది గొండ గిరిజన ఆశ్రమ బాలికల పా ఠ శాలలో విషాద సంఘటన చోటు చే సుకుంది. ఆశ్రమ విషాహారం తిని విద్యార్థినులు అస్వస్థతకు గురి కా వడo తీవ్ర సంచలనం సృష్టించిం ది. బాలికల ఆశ్రమ పాఠశాలలో సు మారు 310 మంది విద్యార్థులు ఉ న్నారు. ఆదివారం రాత్రి విద్యార్థిను లకు అల్పాహారంగా పెసర గుగ్గిళ్ల ను పెట్టిన కొద్ది సేపటి తరువాత బ గారా, చికెన్ తో భోజనం పెట్టారు. రాత్రి భోజనం తిన్న తర్వాత పాఠ శాలలోని కొంతమంది బాలికలు క డుపునొప్పితో బాధపడుతూ విరే చనాలు అయ్యాయి.
సోమవారం ఉదయం అల్పాహా రం గా పులిహోర వడ్డించారు. ఇది తి న్న అనంతరం 35 మంది విద్యార్థి నులు తీవ్రమైన కడుపు నొప్పి, విరే చనాలతో బాధపడుతుండడంతో ఆందోళన చెందిన టీచర్లు పాఠశాల ఏఎన్ఎం సాయంతో ముదిగొండ గ్రా మంలోని ఆర్ఎంపీ డాక్టర్ వద్దకు చి కిత్స నిమిత్తం పంపించారు. ఈ క్రమంలో దేవరకొండ ప్రభుత్వ ఆ స్పత్రిలో 13 మంది, తూర్పుపల్లి
పీహెచ్సీ 22 మందికి చేర్పించారు. ఈ రెండు ఆస్పత్రిలో వైద్య సేవలు పొందిన బాలికల ఆరోగ్యం నిల కడగా ఉందని వైద్యులు చెప్ప డంతో ఉపాధ్యాయులు, తల్లిదం డ్రులు ఊపిరి పీల్చుకున్నారు.
ఫుడ్ పాయిజన్ వల్లే విద్యార్థినులు అస్వస్థత కు, గురైనట్లు వైద్యులు చెప్పారు. సమాచారం అందుకున్న ఆర్డీఓ రమణారెడ్డి హుటాహుటిన ఆస్పత్రికి చేరుకుని బాలికలను ప రామర్శించారు. అలాగే ముదిగొండ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల ను సందర్శించి వివరాలు తెలుసు కున్నారు.