Nominations: నామినేషన్ లు పరిసమాప్తం
తెలంగాణలో నామినేషన్ల పర్వం గురువారంతో ముగిసింది. ఆఖరి రోజైన గురువారం నామినేషన్ లు పోటెత్తాయి.
ఆఖరి రోజు పోటెత్తిన నామి నేషన్ లు
బండి, వెంకట్రామిరెడ్డి, మాధవి లత,ధర్మపురి, బాబు మోహన్ ల నామినేషన్ లు
మల్కాజిగిరిలో అత్యధికంగా 101 నామినేషన్లు
తెలంగాణాలో ఇప్పటి వరకూ 572 నామినేషన్లు
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో నామినేషన్ల(Nominations) పర్వం గురువారంతో ముగిసింది. ఆఖరి రోజైన గురువారం నామినేషన్ లు పోటెత్తాయి. ఆయా నియోకవర్గాల రిటర్నింగ్ అధికారుల కార్యాల యాలు నామినేషన్ వేసే అభ్యర్ధుల తో కిటకిట లాడాయి. ఇక తెలంగా ణలో ఈ రోజు బిజెపి అభ్యర్ధి బండి సంజయ్ కరీంనగర్ స్థానానికి, మెదక్ బిఆర్ ఎస్ అభ్యర్ధి వెంకట్రామిరెడ్డి, హదరాబాద్ స్థానంలో బిజెపి అభ్యర్ధి మాధవీ లత, నిజమాబాద్ బిజెపి అభ్యర్ధి ధర్మపురి అరవింద్, వరంగల్ లో స్వతంత్ర అభ్యర్ధిగా బాబు మోహన్ తో తో పాటు పలు నియోజకవ ర్గాలలో భారీ సంఖ్యలో నామినే షన్ లు దాఖలయ్యాయి.
మల్కా జిగిరి లోక్ సభ స్థానానికి అత్యధిక సంఖ్యలో 101 నామినేషన్లు దాఖలు కాగా, మహబూబాబాద్ స్థానంలో అత్యల్పంగా 31 నామినేషన్ లు వేశారు. లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల గడువు ముగిసే నాటికి సుమారు 572 మంది అభ్యర్థులు పత్రాలు దాఖలు చేశారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికకు(By election) 38 మంది నామినేషన్లు దాఖలు చేశారు. నియోజకవర్గాల వారిగా దాఖలైన నామినేషన్లు ఇలా ఉన్నాయి. ఆదిలాబాద్- 39, భువనగిరి- 81,చేవెళ్ల-59
హైదరాబాద్-48, కరీంనగర్-69
ఖమ్మం-57, మహబూబాబాద్-32
మహబూబ్ నగర్-42, మల్కాజిగిరి 101, మెదక్-55 నాగర్ కర్నూల్-23
నల్గొండ-85, నిజామాబాద్-77 పెద్దపల్లి-74, సికింద్రాబాద్-60
వరంగల్-62, జహీరాబాద్- 41 నామినేషన్ లు దాఖలయ్యాయి.
Nominations of the last day