Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Minister KTR : కాలం కానేకాదు హస్తం సర్కారే కాటేస్తోంది

–రైతన్నలను కాపాడుకునేందుకు నిరంతరం పోరాటం
–బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మా జీ మంత్రి కేటీఆర్ ఫైర్

Minister KTR : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో కాలంకాటేయడం లేదని, కాం గ్రెస్ ప్రభుత్వం మాత్రమే కాటేస్తున్న దని, కరువు కాటేయడం లేదు, కా లువల్లో నీళ్లు పారించకుండా కాంగ్రె స్ కాటేస్తున్నది బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,మాజీ మంత్రి కేటీఆర్ తీ వ్ర స్థాయిలో మండిపడ్డారు. కాళేశ్వ రం ప్రాజెక్టు నీటిని ఎత్తి పోయకుం డా ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంతో రైతు ల పొలాలకు నీరు అందకుండా చే స్తున్నారని, ఈ క్రమంలో కాలువల్లో నీటికి బదులు రైతుల కన్నీళ్లు పారు తున్నాయని ఆవేదన వ్యక్తం చేశా రు.

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ను నిర్లక్ష్యం చేస్తూ వ్యవసా య రంగాన్ని సంక్షోభంలోకి నెట్టివే సిందని తీవ్ర విమర్శలు గుప్పించా రు. బీఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 600 మీటర్ల ఎత్తున నీటిని ఎత్తిపోసి, 450కిలోమీటర్ల దూరం ప్రయాణించి సూర్యాపేట జి ల్లాలోని పెన్ పహాడ్ మండలంలోని రావిచెరువు వరకు నీరు చేరిందని, రైతుల పొలాలను తడిమిందని కే టీఆర్ గుర్తుచేశారు. అయితే కాంగ్రె స్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ బ్యారేజీ మర మ్మతులు చేయకపోవడం, కన్నెపల్లి పంప్ హౌస్ నుండి నీటిని ఎత్తిపో యకపోవడం వల్ల రైతులకు సాగు నీరు అందడం లేదని కేటీఆర్ ఆరో పించారు.

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద 2001లో పూర్తైన కాకతీయ వరద కాలువ, బీ ఆర్ఎస్ పాలనలో కాళేశ్వరం ఎత్తి పోతల ద్వారా 153కిలోమీటర్లు ప్ర యాణించి చివరి ఆయకట్టుకు నీరు చేరిందని, కానీ ఇప్పుడు కాంగ్రెస్ ని ర్లక్ష్యం వల్ల ఆ నీరు అందడం లేదని ఆయన విమర్శించా రు. బీఆర్ఎస్ పాలనలో వ్యవసాయం పండగలా మారిందని, కానీ కాంగ్రెస్ ఏడాదిన్న ర పాలనలో రైతులు తిరిగి సంక్షో భంలోకి నెట్టబడ్డారని కేటీఆర్ ఆరో పించారు. రైతు భరోసా స్కీమ్ పై ఆంక్షలు విధించడం. రూ.2 లక్షల రుణమాఫీ వాగ్దానాన్ని నెరవేర్చక పోవడం, మరియు నీటిపారుదల సౌకర్యాలను అందించకపోవడం వల్ల రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కూ రుకుపోయారని ఆయన విమర్శిం చారు. అంతేకాక కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరురంగారెడ్డి ఎ త్తిపోతల పథకాలను నిర్లక్ష్యం చేసి, నీటిని ఆంధ్రప్రదేశ్ కు మళ్లించడం ద్వారా తెలంగాణ రైతుల పొలాల ను ఎండిపోయేలా చేసిందని కేటీఆ ర్ ఆరోపించారు.

మేడిగడ్డ బ్యారేజీ మరమ్మతులను విస్మరించడం ద్వా రా కాంగ్రెస్ ప్రభు త్వం కేసీఆర్ పై కక్షగట్టి నీటిని ఆం ధ్రప్రదేశ్ కు వదిలేసిందని ఆయన తీవ్రంగా విమర్శించారు. కాంగ్రెస్ ప్ర భుత్వం వ్యవసాయంపై కక్షగట్టి రై తులకు శిక్ష విధిస్తోందని, దీన్ని బీఆ ర్ఎస్ ఎదుర్కొంటుందని ప్రకటించా రు. కాంగ్రెస్ కుట్రలను చేధిస్తాం తె లంగాణ రైతన్నలను కాపాడుకు నేందుకు నిరంతరం పోరాడతామని కేటీఆర్ పేర్కొన్నారు.