Kaleswaram Project: అఫిడవిట్ల సారాంశం ఆధారంగానే నోటీసులు
అధికా రులు, నిపుణులు దాఖలు చేసిన అఫిడవిట్లను అన్నిటినీ పరిశీలించి న తర్వాతే బ్యారేజీల వైఫల్యానికి కారకులుగా భావించే ప్రజా ప్రతిని ధులకు నోటీసులు జారీ చేయడంపై నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ పినా కీ చంద్ర ఘోష్ కమిషన్ నిర్ణయిం చింది.
కాళేశ్వరం విచారణలో ప్రజాప్రతి నిధులకూ ఇవ్వాలని నిర్ణయం
నీటి మళ్లింపుకు ఉపయోగించే బ్యారేజీల్లో నీటి నిల్వ వల్లే వైఫల్యం
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు నిపుణుల కమిటీ స్పష్టీకరణ
ప్రజా దీవెన, హైదరాబాద్: అధికా రులు, నిపుణులు దాఖలు చేసిన అఫిడవిట్లను అన్నిటినీ పరిశీలించి న తర్వాతే బ్యారేజీల (Kaleswaram barrage)వైఫల్యానికి కారకులుగా భావించే ప్రజా ప్రతిని ధులకు నోటీసులు జారీ చేయడంపై నిర్ణయం తీసుకోవాలని జస్టిస్ పినా కీ చంద్ర ఘోష్ కమిషన్ (Justice Pina Ki Chandra Ghosh Commission)నిర్ణయిం చింది. కమిషన్ కార్యాలయంలో గురువారం జస్టిస్ పీసీ ఘోష్‌ను కలి సిన పలువురు మీడియా ప్రతినిధు లతో ఆయన పలు అంశాలకు స్పం దించారు. విద్యుత్తుపై విచారణ చేస్తున్న జస్టిస్ ఎల్.నర్సింహా రెడ్డి మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.
దాంతో నీటిపారుదల శాఖ మంత్రి కేసీఆర్ కాదు, కాళేశ్వరం బ్యారేజీ లు(Kaleswaram barrage) కట్టే సమయంలో ఆయన అల్లు డు మంత్రిగా ఉన్నారని గుర్తు చేశా రు. అయితే హరీశ్ రావుకు కూడా నోటీసులు ఇస్తారా అన్న ప్రశ్నకు అఫిడవిట్లలో ఉన్న వివరాల ఆధా రంగానే నోటీసులపై తదుపరి నిర్ణ యం ఉంటుందని బదులిచ్చారు. విచారణలో భాగంగా మరోసారి క్షేత్ర స్థాయి తనిఖీలకు వెళ్లాలని కమి షన్ యోచిస్తోందని, అలాగే, కేంద్ర నీరు, విద్యుత్తు పరిశోధన సంస్థ ప్రతినిధులను నేరుగా కలవాలని నిర్ణయించినట్లు ఆయా వర్గాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుతం సాంకే తిక అంశాలపై విచారణ జరుపు తున్న కమిషన్ త్వరలోనే ఉల్లం ఘనలపై గురిపెట్టనుందని, నీటి మళ్లింపు కోసమే బ్యారేజీలు నిర్మి స్తారని, దానికి భిన్నంగా నదీ గర్భం లో నీటిని నిల్వ చేయడం కార ణంగా బ్యారేజీలు విఫలమయ్యా యని నిపుణుల కమిటీ స్పష్టం చేసినట్లు సమాచారం. నిల్వతో ఒత్తిడి పెరిగి, పునాది కింది నుంచి ఇసుక జారిపోవడం వల్లే మేడిగడ్డ బ్యారేజీ కుంగిందని వివరించింది. అన్నారం, సుందిళ్లలోనూ సీపేజీలు ఏర్పడ్డాయని గుర్తు చేసింది. కాళేశ్వ రం బ్యారేజీలపై విచారణ జరుపు తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గురువారం బూర్గుల రామకృష్ణారా వు భవన్‌లో నిపుణుల కమిటీ చైర్మ న్ డాక్టర్ సీబీ కామేశ్వరరావు సభ్యులు కె.సత్యనారాయణ, ప్రొఫెసర్ రమణమూర్తి , ప్రొఫెసర్ పి.రాజశేఖర్, కన్వీనర్ ఈఎన్‌సీ జి.అనిల్‌కుమార్‌తో సమావేశమైం ది.
ఈ సందర్భంగా, బ్యారేజీల వైఫ ల్యానికి కారణాలేమిటని ఘోష్ ఆరా తీయగా నీటిని నిల్వ చేయ డమే కారణమని నిపుణుల కమిటీ తేల్చి చెప్పింది. బ్యారేజీలను నీటి మళ్లింపు కోసమే కట్టాలని, నీటి నిల్వకు రిజర్వాయర్లు, డ్యామ్‌లు కట్టుకోవాలని స్పష్టం చేసింది. బ్యా రేజీలను రిజర్వాయర్‌లాగా వాడు కొని నీటిని నిల్వ చేశారని, ఆపరే షనల్ మాన్యువల్ పాటించకుండా నీటిని వదిలారని, అందుకే, బ్యారే జీలు దెబ్బతిన్నాయని తెలిపింది. కాగా, బ్యారేజీలపై రెండు వారా ల్లోపు మధ్యంతర నివేదికను అం దించి, పూర్తిస్థాయి నివేదికను వీలై నంత త్వరగా సమర్పించాలని కమి టీకి కమిషన్ సూచించింది.
విజిలె న్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్(Vigilance enforcement) నుంచి పూర్తిస్థా యి నివేదికను తెప్పించుకోవాలని అధికారులను ఆదేశించింది. ఆ తర్వాత హైడ్రాలజీ విభాగం అధి కారులను కూడా కమిషన్ ప్రశ్నిం చింది. శుక్రవారం ఆపరేషన్ అండ్ మెయింటినెన్స్‌తోపాటు ఈఎన్‌సీ కార్యాలయంలోని అధికారులను కమిషన్ విచారించనుంది. కాళేశ్వ రం బ్యారేజీలపై విచారణలో భాగం గా ఓపెన్ కోర్టు కూడా నిర్వహిం చనున్నట్లు కమిషన్ ప్రకటించింది. ఓపెన్ కోర్టుకు ప్రజలు ఎవరైనా నేరుగా హాజరై, విచారణ క్రమంలో బాధ్యులైన వారిని ప్రశ్నలు అడిగే అవకాశం ఇస్తామని తెలిపింది.
Notices based on summary of affidavits