NSS DAY: ప్రజా దీవెన, కోదాడ: మున్సిపల్ పరిధిలోని స్థానిక బాలాజీ నగర్ లో ఉన్న కే ఆర్. ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మరియు కెఆర్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎన్.ఎస్.ఎస్ N.S.S)విభాగం ఆధ్వర్యంలో జాతీయ సేవా పథక ఆవిర్భావ దినోత్సవం (NSS DAY)వేడుకలను డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ చందా అప్పారావు అధ్యక్షతన జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి, తెలుగు లెక్చరర్ వేముల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించినారు ఈ కార్యక్రమంలో కళాశాలల ప్రిన్సిపల్ లు చందా అప్పారావు ఎన్. రమణారెడ్డి ముఖ్య అతిథిలుగా పాల్గొని మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ లో విద్యార్థులు భాగస్వాములు కావడం ద్వారా “నాకోసం కాదు – మీకోసం” అనే నినాదంతో…
విద్యార్థులు తరగతి గదికే పరిమితం కాకుండా, సేవలో (seva) భాగస్వాములైన వారికి మానవీయ విలువలు నేర్పి, సమాజం పట్ల బాధ్యతను పెంచి, ఆత్మవిశ్వాసాన్ని, సేవా దృక్పథాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తుందని అన్నారు. ముఖ్యంగా ఎన్.ఎస్.ఎస్ కార్యకర్తగా ఉన్న విద్యార్థి సామాజిక కార్యకర్తగా, సమర్థవంతమైన నిర్వాహకునిగా, నాయకునిగా, వ్యక్తిత్వ వికాస నిపుణులుగా, ఆత్మస్థైర్యంతో ఎలాంటి గడ్డు పరిస్థితులనైనా ఎదుర్కొనే విధంగా తయారవుతారని అన్నారు.
ఎన్.ఎస్.ఎస్ డే సందర్భంగా పాటల పోటీలు, వక్తృత్వ పోటీలు, వ్యాస రచన పోటీలు (Singing competitions, Elocution competitions, Essay writing competitions)నిర్వహించగా అందులో గెలుపొందిన ప్రతి ఒక్కరికి సర్టిఫికెట్స్ ప్రధానం చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారులు వీ శ్రీలత ,డాక్టర్ ఎన్ నిర్మల కుమారి, ఈ వెంకటేశ్వర రెడ్డి .కళాశాల ఫిజికల్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ అధ్యాపకులు సైదులు సైదమ్మ రాజా శ్రీలక్ష్మిఅధ్యాపకులు జి.లక్ష్మయ్య,ఆర్. పిచ్చిరెడ్డి, వేముల వెంకటేశ్వర్లు, జి. యాదగిరి, వి.బల భీమారావు, ఆర్.రమేష్ శర్మ, బి.రమేష్ బాబు, జి.వెంకట రెడ్డి, పి.తిరుమల, యస్.గోపి కృష్ణ, యం.చంద్రశేఖర్,యస్. కె ముస్తఫా, నరసింహారెడ్డి, కె.శాంతయ్య, అన్వేష్, ఆర్. చంద్రశేఖర్ గౌడ్,యస్. వెంకటాచారి, టి.మమత, డి.ఎస్. రావు, ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.