*పేదల పక్షపాతి ఎన్టీఆర్.
*తెలుగు ప్రజల ఆరాధ్య దైవం ఎన్టీఆర్.
NTR : ప్రజా దీవెన, కోదాడ: పేదల బడుగు బలహీన వర్గాల పక్షపాతి ఎన్టీఆర్ అని పలువురు కాకతీయ సేవాసమితి సభ్యులు పేర్కొన్నారు. శనివారం ఎన్టీఆర్ 29వ వర్ధంతి సందర్భంగా కోదాడ పట్టణంలోని ఖమ్మం క్రాస్ రోడ్ లో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ నాడు ఎన్టీఆర్ పేదల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు.
ప్రవేశపెట్టి రాజ్యాధికారంలో బడుగు బలహీన వర్గాలకు పెద్దపీట వేసి ప్రజల గుండెల్లో నేటికీ చిరస్థాయిగా నిలిచిపోయారని వారు చేసిన సేవలను కొనియాడారు. అనంతరం పేదలకు స్వీట్లు, పులిహోర అల్పాహారాన్ని పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ డిసిసిబి చైర్మన్ ముత్తవరపు. పాండురంగారావు, రావెళ్ల సీతారామయ్య, వైద్యులు డాక్టర్ జాస్తి. సుబ్బారావు, వేమూరి సురేష్,గంట. సత్యనారాయణ, పోటు. రంగారావు, మందారపు అనంత రాములు, బత్తినేని హనుమంతరావు, కాకర్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.