–ప్రతీక్ ఫౌండేషన్ సీఈవో ఎం.వి గోనారెడ్డి
Nv Gona Reddy : ప్రజా దీవెన, కనగల్: విద్యార్థులు కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలని ప్రతిక్ ఫౌండే షన్ సీఈఓ, ప్రముఖ విద్యావేత్త ఎం.వి గోనా రెడ్డి అన్నారు. బుధవారం కనగల్ మండలంలోని చిన్న మాదారం ఉన్నత పాఠశాలలో ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులకు టై ,బెల్టులు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు ప్రతీక్ ఫౌండేషన్ ఎల్లవేళలా అండగా ఉంటుందని అన్నారు.పదవ తరగతి ఫలితాలలో 10 జీపీఏ పాయింట్లు సాధించిన విద్యార్థులకు ప్రతిక్ ఫౌండేషన్ నుండి ఆర్థిక సహాయం అందిస్తామని అన్నారు. పాఠశాల గ్రంథాలయానికి పుస్తకాలు అందజేసినట్టు తెలిపారు.
పాఠశాల గెజిటెడ్ ప్రధానోపాధ్యాయురాలు వి.పద్మ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పల్ రెడ్డి ఫౌండేషన్ చైర్మన్ పల్ రెడ్డి రాంరెడ్డి, మాజీ సర్పంచ్ దేప నరేందర్ రెడ్డి,హుస్సేన్, రమేష్ రెడ్డి, రచయిత కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, మధుసూదన్ శశిరేఖ, ఉమా,వాసు రాజు మరియు విద్యార్థులు పాల్గొన్నారు.