— అదనపు కలెక్టర్ జిల్లా గ్రంథాల య సంస్థ ప్రత్యేక అధికారి జె. శ్రీని వాస్
Officer J. Srinivas : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న చందం పేట గ్రంథాలయ భవనాన్ని పూర్తి చేసేందుకు అవసరమైన నిధుల మంజూరుకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ సంచాలకులకు ప్రతిపాదన లు పంపించాలని జిల్లా గ్రంధాలయ సంస్థ సర్వసభ్య సమావేశం తీర్మా నించింది.గురువారం అదనపు కలెక్టర్ జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రత్యేక అధికారి జె. శ్రీనివాస్ అధ్య క్షతన తన చాంబర్లో నిర్వహించిన నల్గొండ జిల్లా గ్రంధాలయ సర్వస భ్య సమావేశానికి ఆయన అధ్యక్ష త వహించారు. 2024 -25 సంవ త్స రంలో గ్రంథాలయ సంస్థ ద్వా రా చేసిన ఖర్చు, వచ్చిన రాబడు లు, లైబ్రరీ సెస్, తదితర అంశాల పై చర్చించారు.
వార్తాపత్రికలకు సంబంధించి రిజిస్టర్, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని ,అలాగే ఆడిటింగ్ చర్యలు తీసుకోవాలని సూచించారు. జిల్లా లైబ్రరీలో వాచ్ మెన్ నియామకానికి సంచాలకుల అనుమతి కోసం సమావేశం ఏకగ్రీ వంగా తీర్మానించింది. జిల్లా గ్రంధా లయ సంస్థ కార్యదర్శి బాలమ ణి ,జిల్లా విద్యాశాఖ అధికారి బిక్ష పతి, జిల్లా పంచాయతీ అధికారి వెంకయ్య, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, వయోజన విద్యాశాఖ పిఓ మమత, తదిత రులు ఈ సమావేశానికి హాజర య్యారు.