Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Prajavani Petition Resolution :ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలి….

–జిల్లా వెబ్ పోర్టల్ లో శాఖల వారీగా వార్షిక కార్యాచరణ ప్రణాళికలు అప్డేట్ చేయాలి….

–వేసవిలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలి…..

–ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ యువ వికాసం అమలుకు ఏర్పాట్లు చేయాలి…..

–ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేయాలి…

–జిల్లా కలెక్టర్*తేజస్ నంద్ లాల్ పవార్*

Prajavani Petition Resolution :ప్రజాదీవెన, సూర్యాపేట : ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించేందుకు అధికారులు ప్రత్యేక శ్రద్ద పెట్టాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు. సోమవారం కలెక్టరెట్ కార్యాలయం లోని సమావేశ మందిరం లో జరిగిన ప్రజావాణి లో జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పాల్గొని ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వెబ్ పోర్టల్ నందు శాఖల వారీగా డిపార్ట్మెంట్ ప్రొఫైల్, జిల్లా స్థాయి నుండి క్షేత్ర స్థాయి వరకు సిబ్బంది వివరాలు, జాబ్ చార్ట్,వార్షిక నివేదిక,శాఖ ల వారీగా అమలు చేసిన పథకాల లబ్ధిదారులు వివరాలు అప్డేట్ చేయాలని తెలిపారు.ప్రతి శాఖ కార్యాలయంలో ఒక్క అధికారిని నోడల్ అధికారిగా నియమించి శాఖ పరంగా చేయు స్కీమ్స్, ప్రోగ్రామ్స్, అలాగే సమస్య లు ఏమైనా ఉన్న తమకి తెలియజేయాలని అన్నారు.

ఎంపిడిఓలు, ఆర్ డబ్ల్యూ ఎస్ అధికారులు, పంచాయతీ కార్యదర్సులతో సమన్వయం చేసుకుంటూ
వేసవి లో త్రాగునీటి సమస్య లేకుండా ప్రటి ఇంటికి త్రాగునీరు సరఫరా చేయాలనీ జిల్లాలో త్రాగునీటి సమస్య లేకుండా చూడాలని తెలిపారు.

జిల్లా అధికారులు చేయు పర్యటనలకి సంబందించిన వివరాలను తప్పకుండా ప్రతి అధికారి టూర్ డైరీ ను కలెక్టరేట్ అధికారులకి సమర్పించాలని, అలాగే జిల్లా అధికారులు తమ శాఖకి సంబందించిన బ్యాంకు అకౌంట్ వివరాలను తమకి సమర్పించాలని ఆదేశించారు.

రెవిన్యూ సదస్సులు జరుగుతున్నందున ఆ గ్రామాలలో పంచాయతీ, పాఠశాలలు, వెల్ఫేర్ హాస్టల్స్,హాస్పిటల్స్, అంగన్వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హల్ లకి సంబందించిన భూముల వివరాలను రికార్డులలో తప్పని సరిగ్గా నమోదు చేయాలని అన్ని శాఖల అధికారులకి సూచించారు.ప్రభుత్వ స్థలాలు కబ్జా కాకుండా కాపుడుకోవాలని తెలిపారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలపై నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, మండలాల ప్రత్యేక అధికారులు సమన్వయం చేసుకుంటూ త్వరగా పూర్తి చేసేలా ప్రణాళికలు తయారు చేసుకోవాలని తెలిపారు.

ఈ నెల 25 లోపు సంక్షేమ అధికారులు రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తులని పరిశీలించి, బ్యాంకు క్లియరెన్స్ ఇప్పించి లబ్దిదారులని ఎంపిక చేయాలని తదుపరి జూన్ 2 వ తారీఖున ఎంపికైన లబ్ధిదారులకి ఉత్తర్వులు ఇవ్వటం జరుగుతుందని తెలిపారు.

అధికారులు తమ శాఖలో పాలన కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకవస్తే అందరం కలిసి పరిష్కరించుకుందాం అని తెలిపారు.

ధాన్యం కొనుగోలు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజావాణి లో అర్జీలకు సంబంధించి పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను ప్రత్యేక శ్రద్ద పెట్టి వేగవంతంగా పరిష్కరించాలని ఒక్కటే సమస్యపై ఆర్జిదారుడు మరల ధరఖాస్తు ఇవ్వకుండా చూడాలని కలెక్టర్ అధికారులకి సూచించారు.

ప్రజావాణిలో భూ సమస్యలకి సంబంధించి 21 దరఖాస్తులు,వివిధ ఎంపిడిఓ లకి 18 దరఖాస్తులు,మున్సిపల్ కమిషనర్లకి 8,పంచాయతీ రాజ్ శాఖ కి (డి పి ఓ )4,మిగిలిన 15 వివిధ శాఖలకి సంబందించి వచ్చాయని మొత్తం 66 దరఖాస్తులు వచ్చాయని ఆర్జిలను పరిష్కరించాటానికి సంబంధిత అధికారులకు పంపటం జరిగిందని తెలిపారు.

ఈ సమావేశం లో డి ఆర్ డి ఎ పిడి వివి అప్పారావు, డి పి ఓ యాదయ్య, డి డబ్ల్యూ ఓ నరసింహారావు,సీపీ ఓ కిషన్, డి ఈ ఓ అశోక్, డి యమ్ హెచ్ ఓ కోటాచలం, డి ఎ ఓ శ్రీధర్ రెడ్డి,వెల్పేర్ అధికారులు శంకర్, దయానంద రాణి, జగదీశ్ రెడ్డి, శ్రీనివాస్ నాయక్, సుపారిటిడెంట్లు సాయిగౌడ్,శ్రీనివాస రాజ్, శ్రీలత రెడ్డి అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.