–రాష్ట్ర గౌరవ అధ్యక్షులు వంగూరి రాములు
Nationwide Workers Strike :ప్రజాదీవెన నల్గొండ :భవన నిర్మాణ కార్మికుల 1996 కేంద్ర చట్టం రక్షణకై మే 20న జరిగే దేశవ్యాప్త సమ్మెలో నిర్మాణరంగ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) రాష్ట్ర గౌరవాధ్యక్షులు వంగూరి రాములు కార్మికులకు పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) నల్గొండ జిల్లా విస్తృత సమావేశం జిల్లా అధ్యక్షుడు కంచి కేశవులు అధ్యక్షతన దొడ్డి కొమరయ్య భవన్ లో సోమవారం జరిగింది.ఈ సందర్భంగా వంగూరి రాములు మాట్లాడుతూ అనేక దశాబ్దాల పోరాటాల ఫలితంగా సాధించుకున్న భవన నిర్మాణ కార్మికుల 1996 కేంద్ర చట్టాన్ని, 1979 అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని కాపాడుకోవడం కోసం జరుగుతున్న ఈ దేశవ్యాప్త సమ్మెలో కార్మిక వర్గం కదం తొక్కాలని కోరారు. ఈ చట్టాలే రద్దు అయితే కార్మికులు ఇప్పటిదాకా అనుభవిస్తున్న సంక్షేమ పథకాలన్నీ రద్దవుతాయని అన్నారు. పెండింగ్ క్లెయిమ్స్ వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రెన్యువల్ తేదీ దాటిపోయిన కార్డులన్నిటిని వెంటనే రన్వేలు చేయాలని కోరారు.
కార్మికులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను రెట్టింపు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాలు పోరాడుతుంటే ఉన్న వెల్ఫేర్ బోర్డు నే నిర్వీర్యం చేయాలని కేంద్ర ప్రభుత్వాలు చూస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. యూనియన్ జిల్లా కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డులో 5500 కోట్ల రూపాయలు నిధులు ఉన్నాయని వాటిని కార్మికుల సంక్షేమాన్ని కాకుండా ఇష్టం వచ్చినట్లుగా దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ అనుమతి లేకుండా బోర్డు నిధులు ఖర్చు చేయరాదని నిబంధన ఉన్న పాటించడం లేదని ఆరోపించారు. బోర్డు ద్వారా అమలవుతున్న ఈ పథకాలను బీమా కంపెనీలకు అప్పచెప్పితే వద్దని కోరారు.1996 కేంద్ర చట్టం రద్దయితే బోర్డు భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతుందని సెస్సునిధులు వసూలు కుదిస్తారని దీనితో కార్మికులకు అందుతున్న ఈ కొద్దిపాటి సంక్షేమ పథకాలు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. కార్మిక వర్గ హక్కుల కోసం జరుగుతున్న దేశ వ్యాప్త సమ్మెలో భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ఫెడరేషన్ జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, ఎస్. సైదాచారి, అవుట రవీందర్, బివెంకటయ్య, ఎం. రామకృష్ణ, ఎస్.కె. హుస్సేన్, వెంకట్రావు, మల్లయ్య, డి. సోమయ్య, ఆంజనేయులు, జి. శ్రీను, ఏ. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.