బ్రేకింగ్….
అయ్యో…పాపం…!
— లారీ టైరు మారుస్తుండగా ప్రమాదం
— ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం
ప్రజా దీవెన/ జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం బీచుపల్లి సమీపం లోని కృష్ణానది బ్రిడ్జి పై లారీ కి టైరు మారుస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదం లో ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. కృష్ణానది బ్రిడ్జి పై లారీ ఫంక్చర్ కావడంతో లారీ కి సంబంధించిన ఇద్దరు టైరు మారుస్తుండగా వెనుక నుండి వేగంగా వచ్చిన కారు బలంగా ఢీకొట్టడంతో ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ప్రమాదం లో మృతి చెందిన ఇదరూ కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారిగా పోలిసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.