Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Olampics : ఒలంపిక్ క్రీడల్లో గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం

ఒలంపిక్ క్రీడల్లో గ్రామీణ క్రీడాకారులకు ప్రోత్సాహం

— నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

ప్రజా దీవెన, నల్లగొండ: ఒలంపిక్ క్రీడలలో మెడల్స్ సాధిం చే దిశగా గ్రామీణ క్రీడాకారు లను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో సీఎం క్రీడా కప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలి పారు. ప్రజా పాలన విజయోత్స వాలలో భాగంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా ఈనెల 7, 8 తేదీలలో గ్రామాలలో పోటీలు నిర్వ హించడం జరుగుతుందన్నారు.

గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, హెడ్మాస్టర్, సీనియర్ ఆట గాడు కమిటీలో సభ్యులుగా ఉంటారని , అనంతరం మండల స్థా యికి వచ్చిన క్రీడాకారులతో ఈ నెల 10 నుండి 12 వరకు మండల స్థాయిలో సి ఎం కప్ క్రీడా పోటీలు నిర్వహించడం జరుగుతుందని, ఈ పోటీలు ప్రత్యేక అధికారి అధ్యక్షతన, ఎంపీడీవో కన్వీనర్ గా, త హసిల్దార్, ఎంఈఓ, స్కూల్ గేమ్ ఫెడరేషన్ తరఫున ఒకరు సభ్యు లుగా ఉంటారని చెప్పారు.

మండల స్థాయి క్రీడా పోటీల అనంతరం జిల్లా స్థాయిలో ఈ నెల 16 నుండి 21 వరకు 5 రోజుల పాటు సీఎం క్రీడా కప్ పోటీలు నిర్వ హించడం జరుగుతుం దని,జిల్లా కమిటీ లో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ,ఎస్పీ వైస్ చైర్మన్ గా, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కోవైస్ చైర్మన్ గా ఉంటా రని, స్పెషల్ ఆఫీసర్, ఒలంపిక్ అసోసియేషన్ అధ్య క్షులు, డిఈఓ, జిఎం ఇండస్ట్రీస్, మున్సిపల్ కమిషనర్, ఎస్జీఎఫ్ డిస్టిక్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, డిపిఆర్ఓ, సీఈవో, డి ఐ ఓ ఆధ్వ ర్యంలో ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారని తెలిపారు.

అన్నిస్థా యిలో క్రీడలను సమ ర్థవంతంగా నిర్వహించాలని, ప్రత్యే కించి పోటీలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి క్రీడాకారులను ప్రోత్స హిం చాలని ముఖ్యంగా 2028 లో నిర్వహించనున్న ఒలింపిక్స్ లో రా ష్ట్రం నుండి మెడల్స్ సాధించే దిశగా క్రీడాకా రులను తయారు చే యాలని ఆమె ఆదేశించారు. అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్, డిఆ ర్ఓ అమరేందర్, స్పెషల్ కలెక్టర్ నటరాజ్ ,జిల్లా నూతన స్పోర్ట్స్ అధి కారి నర్సీరెడ్డి తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు.

Olampics