Officialsnegligence : ప్రజా దీవెన, నల్లగొండ: బతుకు జట్కా బండిని విజయ తీరాలకు చే ర్చిన వారి జీవితం మాత్రం ఆటు పోట్ల ప్రయాణంగా సాగుతోంది. అలుపుసలుపు లేకుండా రాజీ లేని బతు కు పోరాటంతో విజయ పతాకాన్ని ఎగరేసిన వారు మాత్రం అన్నిం టా నిరాశ నిట్టూర్పులతో కాలం వెళ్లదీసి పరిస్థితులు నెలకొ న్నాయి. కురు వృద్ధాప్యంలో పిల్లల నిరాదరణ, నిర్లక్ష్యపు ధోరణులకు ఆ త ల్లిదండ్రులు అనుభవిస్తున్న మూగ వేదన ఓ నూతన మానవ విలు వల విధ్వంసo ఘటనకు నిలువెత్తు నిదర్శనం.
ఓవైపు అయి న వారి నిరాదరణ, వారి హక్కు ల ను కాపాడాల్సిన చట్టo చిన్న చూ పు వెరసి వారిని ఈ అవసానదశ లో అవస్థల పా లు చేస్తోంది. వృద్ధా ప్యంలో వెన్నుదన్నుగా నిలవాల్సిన చట్టం వెన్ను విరుస్తూ సదరు వృద్ధు లను మనోవధనకు గురిచేస్తోంది. సూర్యా పేట జిల్లా హుజూర్నగర్ ప్రాంతానికి చెందిన ఆ కురువృద్ధురాలి దీన స్థితి కథాకమీషు ఇలా ఉంది. వయోవృద్ధుల పోషణ సంరక్షణ కోసం 2007 లో ఆవిష్కృ త మైన చట్టం అమలులో అనేక లోటుపాట్ల మూలంగా వయో వృద్ధు లు మరింత మనొవ్యధకు గురవు తున్నా రు.
వారి హక్కుల సాధనలో అనుభవిస్తున్న అవస్థలకు ఈ లక్ష్మల్ల భాగ్య మ్మ ఉదాంతం నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణం గోవిందాపురం కాలనీకి చెందిన లక్ష్మల్ల భాగ్య మ్మ కు ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు లక్ష్మల్ల కిరణ్ కుమా ర్ 90 శాతం మానసిక వికలాంగుడు, రెండవ కుమారుడు లక్ష్మల్ల మధు, మరొక కుమారుడు లక్ష్మల్ల శేఖర్.
కాగా 2023న డిసెంబర్ 17న భర్త లక్ష్మల్ల పుల్లయ్య మరణానం త రం హైదరాబాదులో నివా సం ఉంటూ హుజూర్ నగర్ చేరిన చిన్న కుమారుడు లక్ష్మల్ల శేఖర్ తల్లిని ఏమార్చి తన పేరున ఉన్న ఎనిమి ది ఎకరాల భూమిని సమా నంగా పంపకాలు చేస్తున్నట్లు నమ్మబలికి తానొక్కడే రిజి స్ట్రేషన్ చేయించుకుని తనని, మానసిక వికలాం గుడైన తన పెద్ద కు మారున్ని అర్ధాంతరంగా వదిలి వెళ్లిన నేపద్యం లో భాగ్యమ్మ వయో వృద్ధుల ట్రిబ్యునల్ ను ఆశ్రయించింది.
హుజూ ర్ నగర్ మండలం హుజూర్నగర్ రెవెన్యూ పరిధిలోని 579 /ఆ, 492/ ఆ 3 – నాలుగు ఎకరాలు, మునగాల మండలం కొ క్కిరేణి రెవిన్యూ పరిధిలో సర్వే నెంబర్ 138/1ఏ, 149/2- నాలు గు ఎకరాలు మొత్తం ఎనిమిది ఎక రాలు తన పేరున గిఫ్ట్ డీడ్ చేయిం చుకొని అనారోగ్యంతో బాధపడు తున్న ఇద్దరినీ వదిలేసి వెళ్లడంతో రెండో కుమారుడు లక్ష్మల్ల మధు వద్ద నలగొండలో ఉం టుంది.
వారం రోజుల తర్వాత జరిగిన విషయా న్ని కుమారుడు కి వివరించ గా ఇ రువురు కలిసి మునగాల మండల ఎమ్మార్వో, కోదాడ ఆర్డీవోకు 20 04 జూన్ 25న లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసింది, జిల్లా కలె క్టర్, ఎస్పీ లతో పాటు మనవహక్కుల కమీషన్ కు జులై 5న ఫిర్యా దు చెసింది (రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా ). అదే క్రమంలో జూలై 13, 200 4న ఆన్లైన్ ద్వారా వయోవృద్ధుల పోష ణ, సంక్షేమ చట్టం 2007 క్రింద తన కు న్యాయం చేయమని ఫిర్యాదు (అప్లికేషన్ నెం: SRP T0000214) చేసింది.
ఆన్లైన్ ఫిర్యాదు నమోదు లో కేవలం ఒక్క ఆధార్ నంబర్ తో ఒకే రెవెన్యూ డివిజన్ లో ఫిర్యా దుకు అవకాశం ఉన్నందున సమ స్యను పీడీ వయోవృద్ధుల సంక్షేమ శాఖకు సైతం మెయిల్ ద్వారా తెలియ జేశారు.
ఎన్ని ప్రయత్నాలు చేసినా తన ప్రార్థనను పట్టించుకోని అధికారులకు మరొకసారి స్వయం గా వెళ్లి వేడుకున్నప్పటికీ ఫలితం లేకపోవడం తో 2024 జూలై 16 న హైదరాబాద్ ప్రజావాణిలో (అప్లికే షన్ నెం SRPDC/E/2024/ 01 026) దరఖాస్తు చేసుకుంది. ఫి ర్యాదుకు స్పందించిన కలెక్టర్ కా ర్యాలయం 8309163471 నంబరు చరవా ణి ద్వారా విచారణ రెండు రెవిన్యూ డివిజన్లలో ఒక అను వైన చోట హాజరు కావచ్చునని, వి చారణ అనంతరం తదుపరి చర్యలు కలెక్ట ర్ గైకొంటారని తెలియజే యడం జరిగింది. కలెక్టర్ కార్యాలయం సూ చనలు మేరకు 2024 ఆగస్టు 24న, సెప్టెంబర్ 21, అక్టోబర్ 19 , నవంబర్ 11వ తేదీలలో ఆర్డీవో హుజూర్ నగర్ కార్యా ల యంలో విచారణకు హాజరై జరిగిన అన్యాయాన్ని, తన అభిప్రా యాన్ని విన్నవించింది.
సీనియర్ సిటిజన్ చట్టం తెలంగాణ రూల్స్ జీవో నెంబర్ 40, డిసెం బర్ 30, 2022 ప్రకారం కేవలం 90 రో జుల్లో విచారణ జరిపి తీర్పు ను వెలువరించాల్సి ఉంది, ప్రత్యేక పరిస్థితుల్లో కేవలం అదనంగా 30 రోజుల గడువు ఇచ్చినప్పటికీ, ఆర్డిఓ లిఖితపూర్వక వివరణ సైతం ఇవ్వాల్సి ఉంది. కానీ లక్ష్మ ల్ల భాగ్యమ్మ విషయంలో జూలై 16, 2024న మొదలైన విచారణ ప్రక్రియ ఆరు నెలల పాటు సాగి అ నేక సంప్రదింపుల అనంతరం డి సెంబర్ 12, 2024న అసం పూర్తి ఉత్తర్వులు జారీ చేసింది.
ఫిర్యా దులో పేర్కొన్నట్టు నాలుగు సర్వే నెంబర్లు మునగాల మండ లం కొక్కిరేణి గ్రామ పరిధిలో రెండు, హుజూర్నగర్ మండల గ్రామ రె వెన్యూ పరిధిలో రెండు సర్వే నంబర్లు పై ఫిర్యాదు చేయగా ఆర్డీవో హుజూర్నగర్ కేవలం తన రెవిన్యూ పరిధిలోని హుజూర్నగర్ సర్వే నెంబర్ లను మాత్రమే ఉటంకిస్తూ ఉత్తర్వులను జారీ చేయడం జరి గింది. జరిగిన అన్యాయాన్ని అధికారుల దృష్టికి తీసుకువెళ్లగ హు జూర్నగర్ రెవె న్యూ డివిజన్ పరిధిలో విచారణ జరిగినట్టె కోదాడ రెవిన్యూ డివిజ న్ పరిధిలో సైతం ఇంకా కేసు నడు స్తున్నట్లు మున గాల మండలం కొక్కిరేణి రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్లకు సం బంధించి ఉత్తర్వులు కోదాడ ఆర్డిఓ ద్వారా జారీ చేయడం జరుగు తుందని అధికారులు మౌఖిక వివరణ ఇవ్వడం జరిగింది.
కాగా నాటి నుండి ఏదో కారణంతో ఎటువంటి పరిష్కారం చూప కుండా ఉత్తర్వుల్లో పేర్కొన్న హు జూర్ నగర్ పరిధిలోని రిజిస్ట్రేషన్ రద్దును అమలు చేయకుండా నిర్ల క్ష్య పూరితంగా వ్యవహరిస్తున్న అధికారుల పట్ల మరో మారు కమిషనర్ వయోవృద్ధుల శాఖ హైద రాబాద్ కు మరియు ప్రజా వాణిలో (SRPDC/E/2024/ 02437, SRPDC/E/2025/ 00100, GWOME11022 500004) ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పటికైనా ఉన్నతా ధికారులు ఈ విషయంలో ప్రత్యేక చొరవ చూపడం ద్వారా వృద్ధు రాలికిన్యాయం చేయాలని కోరుతున్నారు.
జీవితకాలం తాను తన భర్త శ్రమించి పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పిం చి, బాధ్యతలు అన్ని సక్రమంగా నిర్వర్తిస్తే అవసాన దశ లో అత్యాశ తో తల్లిదండ్రుల భాద్య తలు విస్మరించిన కడుపున పుట్టిన వారి మూలంగా దిక్కుతోచని స్థి తిలో మూగ వేదనను అనుభవి స్తూ చట్ట ప్రకారం తనకు న్యాయం జరిగించాలని జిల్లా కలెక్టర్ తో పాటు అధికారుల వైపు ఆశగా ఎదురుచూస్తుంది ఆ తల్లి.