–సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి
Tummala Veera Reddy : ప్రజాదీవెన నల్గొండ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రోజుకు 10 గంటల పని విధానానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ రాష్ట్ర కార్మిక శాఖ ద్వారా శనివారం ఉత్తర్వులు జారీ చేయడాన్ని వ్యతిరేకించాలని సిపిఐఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కష్టజీవుల చెమట చుక్కల్ని కరెన్సీగా మార్చుకోవడానికి కార్పొరేట్లకు బడా యజమానులకు అనుకూలంగా ఎనిమిది 8 గంటల స్థానంలో 10 గంటల పని విధానాన్ని కార్మిక వర్గంతో పని చేయించాలని ప్రభుత్వం తీసుకొచ్చి నిర్ణయాన్ని కార్మిక వర్గం ఉద్యోగ వర్గాలు వ్యతిరేకిస్తూ ఆందోళనలకు సిద్ధం కావాలని వారు పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం మోడీ సర్కారు బాటలోనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా నడుస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు వస్తే చాలు అంటూ ప్రపంచ దేశాలలో పర్యటనలు చేసి వస్తున్న రాష్ట్ర మంత్రులు కేవలం కార్పొరేట్ల కోసమే కార్మికుల శ్రమను పణంగా పెట్టడానికి ఇది ఒక కుట్ర అని తెలియజేస్తున్నాం. చదివిన చదువుకు చేస్తున్న పనికి సంబంధం లేకుండా కార్మికులను శ్రమ దోపిడీ చేయడానికి కట్టు బానిసలుగా మార్చడానికి అలుపెరుగని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెగ ఆరాటపడుతుందని ఆరోపించారు. ప్రధానమంత్రి మోడీ నాలుగు లేబర్ కోడలు అమల్లోకి వస్తే కార్మికులకు కనీస ఉద్యోగ భద్రత కనీస వేతనాలు సెలవుల వంటి అనేకంశాలు కోల్పోవాల్సి వస్తుందని తెలిపారు. కార్మికులు 6 గంటలు పని చేశాక అరగంట విశ్రాంతి తీసుకొని మొత్తం 12 గంటలకంటే ఎక్కువసేపు పని చేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కార్మిక సంఘాలు జులై 9న ఈ విధానాలకు వ్యతిరేకిస్తూ జాతీయ సమ్మె జరుగుతున్న నేపథ్యంలో కార్మిక వర్గంపై రాష్ట్ర ప్రభుత్వం ఒక పిడుగు లాంటి వార్తను కార్మిక వర్గంపై మోపింది. రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా మొదటిసారిగా వివేక్ వెంకటస్వామి తన హయంలో పది గంటల పనిబరాన్ని మోపడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే నేడు అన్ని మండల పట్టణ కేంద్రాలలో కార్మిక వర్గం ఉద్యోగ వర్గాలు నిరసన వ్యక్తం చేయాలని తీసుకున్న నిర్ణయానికి సిపిఎం సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తుంది కార్మికు ఉద్యోగులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసన వ్యక్తం చేయాలని పిలుపునిచ్చారు.