*భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులు అందుకోవాలి.
Oruganti Srinivas Reddy: ప్రజా దీవెన, కోదాడ: కోదాడ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు(Senior leaders of the Congress party) వంగవీటి రామారావు జిల్లా గ్రంథాలయ చైర్మన్ గా పదవి బాధ్యతలు చేపట్టడం తమకు ఎంతో సంతోషకరంగా ఉందని కోదాడ పిఎసిఎస్ చైర్మన్ ఓరుగంటి శ్రీనివాస్ రెడ్డి (Oruganti Srinivas Reddy) అన్నారు. కోమర బండలో సొసైటీ పాలకవర్గంతో కలిసి ఆయనను ఘనంగా సన్మానించారు.
భవిష్యత్తులో మరెన్నో ఉన్నతమైన పదవులను అందుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా వంగవీటి రామారావు మాట్లాడుతూ తాను పార్టీకి చేసిన సేవలకు గాను గుర్తించి మంత్రి ఉత్తమ్, ఎమ్మెల్యే పద్మావతి రెడ్డిలు (Uttam, MLA Padmavathi Reddy) తనకు జిల్లా గ్రంథాలయ చైర్మెన్ గా అవకాశం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ గ్రంధాలయ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ బుడిగం నరేష్,డైరెక్టర్లు పార్వతీ, కమతం వెంకటయ్య,గుజ్జ బాబు,శిరం శెట్టి వెంకటేశ్వర్లు, గోబ్రా,సీఈఓ మంద వెంకటేశ్వర్లు, యూత్ లీడర్ శివా తదితరులు పాల్గొన్నారు.