— నల్లగొండ పిఎసిఎస్ చైర్మన్ ఆల కుంట్ల నాగరత్నం రాజు
PACS Chairman Alakuntla Nagaratnam Raju : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చే స్తామని గొల్లగూడ పిఎసిఎస్ చైర్మ న్ ఆలకుంట్ల నాగరత్నం రాజు అ న్నారు. శుక్రవారం ప్రాధమిక వ్యవ సాయ పరపతి సంఘం గొల్ల గూడ ఆధ్వర్యంలో ముషం పల్లి, రసూల్ పురం, గుండ్లపల్లి, కంచన పల్లి గ్రా మాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొ నుగోళ్లు కేంద్రాలను మంత్రి ఆదేశా ల మేరకు డైరెక్టర్లతో కలిసి ఆయన ప్రారంభించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనా లు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదే శాల మేరకు రైతులు పండించిన చివరి గింజ వరకు కొనుగోలు చేస్తా మని అందులో భాగంగా ధాన్యం కొను గోలు కేంద్రాలను ప్రారంభించడం జరిగిందన్నారు.
రైతులకు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. సన్న ధాన్యం పం డించిన రైతులకు కిం టాకు 500 బోనస్ కల్పిస్తుందని తెలిపారు. రేషన్ కార్డుదారులకు సన్న బి య్యం అందించడం చాలా అభినం దనీయమని అన్నారు.
సన్న బియ్యం పంపిణీ ద్వారా రేష న్ మాఫియా ఉండదన్నారు. రైతు లు సన్న ధాన్యం పండించి ప్రభు త్వానికి అందించాలని సూచించా రు. ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ వైస్ చైర్మన్ తవిటి కృష్ణయ్య, డైరె క్టర్లు దేప వెంకటరెడ్డి,సయ్యద్ హౕశం, రుద్రాక్షి వెంకన్న, మందడి వెంకట్,చింత ఎల్లయ్య,దోటి అం జయ్య,సెక్రటరీ అనంత రెడ్డి, రైతు లు సిబ్బంది తదితరులు పాల్గొ న్నారు.