–సన్నధాన్యానికి కింటాకు 500 రూపాయల బోనస్
–పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగ రత్నం రాజు
PACS Chairman Alakuntla Nagaratnam Raju : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: రైతు పండించిన ప్రతి గింజ కొనుగోలు చేస్తామని గొల్లగూడ పిఎసిఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు అన్నారు. శనివారం ప్రాధమిక వ్య వసాయ పరపతి సంఘం గొల్లగూ డ ఆధ్వర్యంలో దోమలపల్లి, అన్నే పర్తి గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధా న్యం కొనుగోళ్లు కేంద్రాలను మంత్రి ఆదేశాల మేరకు డైరెక్టర్లతో కలిసి ఆయన ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటో గ్రఫీ శాఖ మం త్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి ఆదేశాల మేరకు రైతులు పండించిన చివరి గింజ వరకు కొ నుగోలు చేస్తామని అందులో భా గంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల ను ప్రారంభించడం జరిగింద న్నా రు.
రైతులకు కేంద్రాల వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు చేస్తామన్నారు. సన్నధా న్యం పండించిన రైతులకు కింటాకు 500 బోనస్ ప్రభుత్వం కల్పిస్తుంద ని తెలిపారు.రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం అందించడం చాలా అభినందనీయమని అన్నారు. రై తులు సన్న ధాన్యం పండించి ప్ర భుత్వానికి అందించాలని సూచిం చారు.
ఈ కార్యక్రమంలో పిఏసిఎస్ డై రెక్టర్లు దేప వెంకట రెడ్డి,సయ్యద్ హౕశం, రుద్రాక్షి వెంకన్న, మందడి వెంకట్ రెడ్డి, చింత ఎల్లయ్య,దోటి అంజ య్య,సెక్రటరీ అనంత రెడ్డి, రైతులు సిబ్బంది తదితరులు పా ల్గొన్నారు.