Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Paddy Procurement :వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలి…..

–వర్షాకాలం నాటికి మొక్కలు సిద్ధం చేయాలి….

–ఉపాధి హామీ పనులతో నిర్మిస్తున్న చేప పిల్లల పెంపకం చెరువు పరిశీలన…….

–మిల్లర్లు ధాన్యం వెంటనే దిగుమతి చేసుకోవాలి…..

–జిల్లా కలెక్టర్*తేజస్ నంద్ లాల్ పవార్

Paddy Procurement :ప్రజాదీవెన, సూర్యాపేట : వారం రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ నిర్వాహకులని ఆదేశించారు. గురువారం మద్దిరాల మండలం కేంద్రం లోని ఐకేపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు.ఈ సందర్బంగా కలెక్టర్ ధాన్యం నాణ్యతను, రికార్డులను పరిశీలించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలకి లారీలను పంపిస్తామని త్వరగా కాంటా వేసి ధాన్యం మిల్లులకి తరలించాలని కేంద్ర నిర్వాహకులకి సూచించారు. ఇప్పటి వరకు 5700 క్వింటాల ధాన్యం తరలించామని కలెక్టర్ కి నిర్వాహకులు తెలిపారు.

మద్దిరాల మండలం చిన్న నేమిల గ్రామం లో ఉపాధి హామీ పనులతో త్రవ్వుతున్న చేప పిల్లల పెంపకం చెరువును సందర్శించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటి వరకు ఎన్ని చేప పిల్లల పెంపకం చెరువులు తయారు చేశారు అని అధికారులను అడగగా 2 చెరువులు పూర్తి చేయటం జరిగిందని మరో 2 త్వరలో పూర్తి చేస్తామని తెలిపారు. మీ పిల్లలు ఏమి చదువుతున్నారు అని అడిగి మీ పిల్లలను బాగా చదివించి మంచి స్థాయి కి చేరుకోవాలని ఆకాక్షించారు. ఉపాధి హామీ పనులు చేయు ప్రదేశంలో త్రాగు నీరు, టెంట్ లాంటి మౌళిక వసతులు ఏర్పాటు చేసారా అని అడిగి తెలుసుకున్నారు.ఉపాధి హామీ పనులు చేస్తే రోజుకి ఎన్ని రూపాయలు వస్తున్నాయి అని అడగగా 220 రూపాయలు వస్తున్నాయని కూలీలు తెలిపారు. రోజుకి 307 రూపాయలు ఇస్తారు కాబట్టి ఎండ రాకముందే ఉదయం త్వరగా వచ్చి ఎక్కువ సేపు పనిచేసి 307 రూపాయలు వచ్చేలా చూసుకోవాలని తెలిపారు.
చిన్న నేమిల నర్సరీని సందర్శించి బెడ్ లో ఉన్న ఖాళీలను అందులో నూతన విత్తనం ను వేసి వర్ష కాలం నాటికి మొక్కలను సిద్ధం చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించినారు.

తదుపరి నూతనకల్ మండలం ఎర్రపాడు ఐకెపి కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. కొనుగోలు కేంద్రంలోని సీరియల్ రిజిస్టర్ లను తనిఖీ చేసి సీరియల్ ప్రకారమే కాంటా వేసి మిల్లులకి తరలించాలని నిర్వాహకులకి సూచించారు.ఇప్పటి వరకు ఎర్రపాడు ఐకేపీ కొనుగోలు కేంద్రం నుండి 8017 క్వింటాల ధాన్యం మిల్లులకి తరలించటం జరిగిందని నిర్వాహకులు కలెక్టర్ కి తెలియజేసారు.

సూర్యాపేట మండలం బాలేంల వజ్ర రైస్ ఇండస్ట్రీస్ ని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు తో కలిసి జిల్లా కలెక్టర్ తెజస్ నంద్ లాల్ పవార్ పరిశీలించారు. మిల్లర్లను కొనుగోలు సెంటర్ నుంచి వచ్చిన లారీలను హమాలీల సంఖ్యను పెంచుకొని వెంటనే దిగుమతి చేసుకోవాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో కలెక్టర్ వెంట సివిల్ సప్లై మేనేజర్ ప్రసాద్,తహసిల్దార్లు అమీన్ సింగ్,ఎంపీడీవోలు సత్యనారాయణ రెడ్డి,సునీత,మండల వ్యవసాయ అధికారి మురళి ఏపిఎం మధుసూదన్, ఏ పి ఓ వెంకన్న,ఏ పి యం మైసయ్య, రమణాకర్, సెంటర్ ఇంచార్జి లు నాగార్జున, సునీత,అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.